తెలంగాణలో డిసెంబర్ వరకు లాక్ డౌన్ పొడిగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ తరుపున లేఖ రాస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు. రంజాన్ తరువాత మోహర్రం , బోనాలు , దసరా పండుగ లు వచ్చే అవకాశం ఉండటంతో లాక్ డౌన్ డిసెంబర్ వరకు పొడిగించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. పండుగల పేరుతో లాక్ డౌన్ ఎత్తి వేస్తే ప్రభుత్వం ఇప్పటి వరకు కష్టపడిందంత వృధా అవుతుందని జగ్గారెడ్డి విశ్లేషించారు.
కరోన కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా తాము సహకరిస్తామని జగ్గారెడ్డి తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయలు మాట్లాడటం పిచ్చి వాళ్ళ చర్య అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. లాక్ డౌన్ వల్ల మాత్రమే కరోనను కట్టడి చేయలేము అని చెప్పారు తప్ప ఎత్తివేయమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనలేదని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు సమర్థవంతంగా చేస్తోందని జగ్గారెడ్డి తెలిపారు. తన నియోజకవర్గంలో స్వయంగా తానే కొనుగోళ్లు ప్రారంభించడమే కాకుండా రైతులకు చెక్కులు కూడా అందించామని అన్నారు. తద్వారా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. అకాల వర్షాలతో నష్టపోయిన మామిడి రైతులకు ప్రభుత్వం చేయుత ఇవ్వాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. రంజాన్ సందర్భంగా ముస్లింల పై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. రాజకీయ పార్టీలన్ని కొన్ని రోజులు రాజకీయ పరమైన విమర్శలు చేసుకోకపోవడం మంచిదని సూచించారు.
This post was last modified on April 27, 2020 7:22 pm
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…