Political News

కాళోజీ పుస్త‌కం-రేవంత్ రెడ్డి అంత‌రంగం ఇదే..!

ఇవాళ్టి రోజున పుస్త‌కాలు ఇచ్చి పుచ్చుకునే సంస్కృతి దాదాపు క‌నుమ‌రుగైంది. అంద‌రూ గిఫ్టుల పేరుతో ఖ‌రీదైన వ‌స్తువులు మాత్ర‌మే ఇచ్చి పుచ్చుకుంటున్నారు. ఇక‌, ముఖ్య‌మంత్రులు ఎదురు ప‌డిన‌ప్పుడు కూడా.. ఇదే సంప్ర‌దాయం కొనసాగుతోంది. అయితే.. అస‌లు గిఫ్టు ఎందుకు ఇస్తారంటే.. “నీపై నాకు ఉన్న ప్రేమ‌, అభిమానం, అభిప్రాయాల‌కు ఇదీ ప్ర‌తీక‌” అని చెప్పేందుకే.. గిఫ్టులు ఇస్తారు. అందే.. సంద‌ర్భాన్ని బ‌ట్టి గిఫ్టు ప్రాధాన్యం మారుతుంది.

తాజాగా ముఖ్య‌మంత్రుల భేటీ సంద‌ర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి – ఏపీ సీఎం చంద్ర‌బాబు హైదరాబాద్‌లోని ప్ర‌జాభ‌వ‌న్‌లో భేటీ అయ్యారు. ఈ స‌మ‌యంలో చంద్ర‌బాబు పెద్ద స్వీటు బాక్సుతోపాటు.. శాలువా.. శ్రీవారి చిత్ర‌ప‌టంతో కూడిన మొమెంటోల‌ను రేవంత్‌రెడ్డి బృందానికి ఇచ్చారు. ఇక‌, ఏపీ ముఖ్య మంత్రి చంద్ర‌బాబుకు.. రేవంత్ కూడా బ‌హుమ‌తి అందించారు. వీటిలో రెండు ర‌కాలు ఉన్నాయి. వెండి నంది విగ్ర‌హాన్ని ఇచ్చారు. దీనికి ముందు చంద్ర‌బాబుకు రేవంత్ కాళోజీ నారాయ‌ణ‌రావు రాసిన “నా గొడ‌వ‌” పుస్త‌కాన్ని కానుకగా ఇచ్చారు.

ఇలా, ఒక ముఖ్య‌మంత్రికి.. మ‌రో ముఖ్య‌మంత్రి పుస్త‌కాన్ని బ‌హూక‌రించ‌డం… అనేది ఇప్ప‌టి వ‌ర‌కు అయితే క‌నిపించ‌లేదు. ఇది ఒక‌ర‌కంగా రేవంత్‌తోనే ప్రారంభ‌మైంద‌నే అభిప్రాయం కూడా వ‌స్తోంది. అయితే.. పైన చెప్పుకొన్న‌ట్టుగా.. కానుక‌ల్లో మ‌న అంత‌రంగం ప్ర‌స్ఫుటం అవుతుంది. అలానే ఇక్క‌డ రేవంత్ కూడా.. త‌న అంత‌రంగాన్ని సుస్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. నిజానికి రేవంత్ పుస్త‌కాల‌నే కానుక‌గా ఇవ్వాల‌ని అనుకుంటే… ఇదే తెలంగాణ‌కు చెందిన‌ నారాయ‌ణరెడ్డి రాసిన పుస్త‌కాల‌ను కానుకగా ఇవ్వొచ్చు.

కానీ.. రేవంత్ అలా ఎంచుకోలేదు. దాశ‌ర‌ధి రంగా చార్యులు రాసిన పుస్త‌కాలు కూడా ఇవ్వ‌లేదు. ఏరికోరి.. కాళోజీ నారాయ‌ణ‌రావు రాసిన “నా గొడ‌వ‌” అనే పుస్త‌కాన్ని కానుక‌గా ఇచ్చారు. అయితే.. ఇదేమీ తేలిక‌గా.. తీసేసి పారేసేది కాదు.. చాలా లోతైన అంత‌రంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్క‌రించారు.

‘జీ’ అనని ‘క‌లేజా’తో కాళోజీ అనున‌ది ‘న‌ఖ‌రా’లు లేన‌ట్టిది!
అన్యాయాన్నెదిరిస్తే.. నాగొడ‌వ‌కు సంతృప్తి!

  • అని కాళోజీ ఈ పుస్త‌కంలో స్ప‌ష్టం చేశారు. అంటే.. దీని అనంత‌రం.. తెలంగాణ వాదం.. ప్ర‌జానాదం ముందు.. ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌చ్చినా రాజీ ప‌డేది లేద‌ని రేవంత్ రెడ్డి చెప్ప‌క‌నే చెప్పారు. అంతేకాదు..తెలంగాణ ఉద్య‌మం.. త‌న‌కు అనునిత్యం గుర్తుంద‌ని కూడా.. ఈ పుస్తకాన్ని కానుక‌గా ఇవ్వ‌డం ద్వారా .. చెప్పుకొచ్చారు. మ‌న‌సులో ఏమున్నా.. ఒక్కొక్క‌సారి మాట‌లు పెగ‌ల‌వు. పైకి చెప్ప‌లేని స్థితి, ప‌రిస్థితి కూడా ఉంటాయి. బ‌హుశ ఆస్థితి కార‌ణంగానే రేవంత్ చాలా లోతైన వ్యూహంతో నే చంద్ర‌బాబు ‘నా గొడ‌వ‌’ పుస్త‌కాన్ని కానుకగా ఇచ్చి.. తెలంగాణ అంత‌రంగాన్ని ఆయ‌న ఆవిష్క‌రించి ఉంటారు!!

This post was last modified on July 8, 2024 7:13 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 minutes ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

36 minutes ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

2 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

2 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

3 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

4 hours ago