Political News

పార్ల‌మెంటుకు జ‌గ‌న్‌.. ఉత్తుత్తి ప్ర‌చార‌మా? నిజ‌మా?

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నారా? వచ్చే కొన్ని రోజుల్లో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీ చేయనున్నారా? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం అయితే అధికారికంగా ఎక్కడ వినిపించడం లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం భారీ ఎత్తున ఈ రెండు విషయాలు ప్రచారంలోకి వచ్చాయి. వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి తాజా ఎన్నికల్లో ఘోర పరాజ‌యం మూట కట్టుకున్నటువంటి విషయం తెలిసిందే.

175 స్థానాల్లో విజయం సాధిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి కేవలం 11 స్థానాలకు పరిమితం కావడం.. ప్రధాన ఇబ్బందిగా మారింది. దీనికి తోడు అసెంబ్లీలో ఆయనకు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుందా లేదా అనే విషయం మీద కూడా ఇంకా సస్పెన్షన్ కొన‌సాగుతోంది. ఇదిలా ఉంటే అసలు జగన్మోహన్ రెడ్డి తాను గెలిచినటువంటి పులివెందుల స్థానానికి రాజీనామా చేయటం, అదే సమయంలో కడప ఎంపీగా పోటీ చేయటం అనే ఈ రెండు కాన్సెప్టులు కూడా అత్యంత చర్చనీయ‌ అంశంగా మారాయి.

ఇది నిజమేనా కాదా అనే విషయాన్ని పార్టీ ఇంతవరకు స్పందించలేదు. కానీ వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికి ఇప్పుడు ఇలా చేయాల్సినటువంటి అవసరం కానీ అవకాశం కానీ ఉందా అంటే లేదు. ఎందుకంటే ఇక్కడైనా.. పార్లమెంట్లో అయినా ఆయన చేసేది పెద్దగా ఏమీ లేదు. అయితే పార్లమెంటుకు వెళ్లడం ద్వారా కేంద్రంలో పరిచయాలు పెరుగుతాయని కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రితో మరింత చనువు వస్తుందని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. కానీ, జ‌గ‌న్ స్థాయిని బట్టి అంచనా వేస్తే ఇది అంత పెద్ద విషయం కాకపోవచ్చు.

పైగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటం అంటే రాష్ట్రంలో ఓటమిని ఆయన తట్టుకోలేక, జీర్ణించుకోలేక రాజీనామా చేశారు అనేటటువంటి విమర్శలు మరింత పెరుగుతాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ప్రయత్నం అయితే చేయడు అని మరో వర్గం చెప్తుంది. మరో వైపు తన మాతృమూర్తి విజయలక్ష్మిని పులివెందుల నుంచి పోటీ చేయిస్తారని తద్వారా తాను కడప ఎంపీగా పోటీచేసి పార్లమెంట్లో అడుగుపెడతారని మరో ప్రచారం జరుగుతోంది. దీనిలోనూ వాస్తవం పెద్దగా కనిపించడం లేదు.

ఎందుకంటే విజయలక్ష్మి ఇప్ప‌టికే రాజ‌కీయంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కేవలం ఆమె తన కుమారుడు, కుమార్తె విషయంలో కొద్దిపాటి మద్దతు మాత్రమే ప్రకటిస్తున్నారు. పైగా వైసీపీ గౌరవ అధ్యక్షురాలుగా కూడా ఆమె పదవిని వదులుకున్నారు. విజయలక్ష్మి ఇప్పటికి ఇప్పుడు రావటం పోటీ చేయటం అనేటటువంటిది నిస్సందేహంగా అనుమానం. పైగా జగన్మోహన్ రెడ్డి పులివెందుల వంటి బలమైన స్థానాన్ని వదులుకొని పార్లమెంటుకు పోటీ చేసి ఇప్పుడు కొత్తగా కోరి కష్టాలు కొని తెచ్చుకుంటారని ఎవరో ఊహించరు.

రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఆయనదే. వచ్చే ఐదు సంవత్సరాలు పార్టీకి ఒక అగ్నిపరీక్ష లాంటిది. కాబట్టి ఈ సమయంలో ఆయన రాష్ట్రాన్ని వదిలి ఢిల్లీలో ఉంటారని, పార్లమెంట్లో పాల్గొంటారని అనేవి.. అనవసరమైన ప్రచారమే తప్ప దీనిలో పెద్దగా ఒరిగేది గాని మరొకటి గానీ ఏమీ లేదు. కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తారు. అదేవిధంగా రాష్ట్రంలో పార్టీని కాపాడుకుంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు.

This post was last modified on July 7, 2024 12:20 pm

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

దర్శన్‌ను రేణుక స్వామి ఆత్మ వెంటాడుతోందట

ప్లాన్ చేసి చేశారో.. లేక క్షణికావేశంలో చేశారో కానీ.. కన్నడ కథానాయకుడు దర్శన్ తన అభిమానే అయిన రేణుక స్వామి…

2 hours ago

కర్ణుడిగా సూర్య.. అప్డేట్ వచ్చింది

ఇటీవలే ‘కల్కి’ సినిమాలో కాసేపు ప్రభాస్ కర్ణుడిగా కనిపిస్తే.. ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో తెలిసిందే. మహాభారతంలో ఎన్నో…

7 hours ago

ప‌వ‌న్ విమ‌ర్శ‌ల‌కు డీఎంకే కౌంట‌ర్

తిరుమ‌ల ల‌డ్డు వివాదం త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ హిందువులు ఆచ‌రించే స‌నాత‌న ధ‌ర్మం గురించి చాలా బ‌లంగా గ‌ళాన్ని వినిపిస్తున్న…

10 hours ago

లోకేష్ కనకరాజ్‌కు కోపమొచ్చింది

తమిళంలో ప్రస్తుతం టాప్ డైరెక్టర్లలో ఒకడు.. లోకేష్ కనకరాజ్. మామూలుగా అతను చాలా కూల్‌గా కనిపిస్తాడు. అలాంటి దర్శకుడికి ఇప్పుడు…

10 hours ago

శివ ప్రభంజనానికి 35 వసంతాలు

1989 సంవత్సరం. అక్టోబర్ 5వ తేదీ. బ్రేక్ డాన్సులు, ఫైట్లు, భారీ సెట్ల హంగులు ఆర్భాటాలు, అవుట్ డోర్ లొకేషన్ల…

10 hours ago

తిరుమలలో గోవింద నామస్మరణ మాత్రమే వినిపించాలి

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ…

11 hours ago