తెలంగాణలో ఎమ్మెల్యేల జంపింగుల పర్వం గత వారం నుంచి కొనసాగుతూనే ఉంది. గత నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున విజయం దక్కించుకున్నవారు.. తర్వాత.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. కారణాలు ఏవైనా.. తొలుత ఇద్దరు ముగ్గురుతో ప్రారంభమైన ఈ గోడదూకుళ్లు.. ఇటీవల కాలంలో మరింత పెరిగాయి. వచ్చిన వారిని వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి పార్టీలో చేర్చుకుంటున్నారు. కండువాలు కప్పేస్తున్నారు.
అయితే.. ఈ కథ ఇప్పట్లో ముగిసిపోయేలా కనిపించడం లేదు. ఇప్పటికే.. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, కాలె యాదయ్యలు పార్టీ వీడారు. దీంతో బీఆర్ఎస్ అధినేతలో పునరాలోచన రావాలి. కానీ, మాజీ సీఎం కేసీఆర్ పునరాలోచన చేయడం లేదు. పైగా.. మరో రెండు మాసాల్లో రేవంత్ రెడ్డి సర్కారు కూలిపోతుందనే ఆయన ఇప్పటికీ చెబుతున్నారు.
ఈ వ్యాఖ్యలతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భావన అధికార పక్షంలో ఉంది. దీంతో ఎందుకు అవకాశం ఇవ్వాలి! అనే ధోరణి రేవంత్‌లోనూ కనిపిస్తోంది. దీంతో.,. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా! అంటూ.. వచ్చిన వారిని వచ్చినట్టు పార్టీ తీర్థం ఇస్తున్నారు. ఇక, ఇప్పుడు అత్యంత విశ్వసనీయ గాంధీ భవన్, బీఆర్ఎస్ వర్గాల సమాచారం మేరకు.. మరో ఐదు నుంచి 8 మంది వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. పార్టీ మారే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరిలో కొందరు బీఆర్ ఎస్ అధినేతకు అత్యంత ముఖ్యలని కూడా సమాచారం.
అంతేకాదు.. భాగ్యనగరంలోని రెండు కీలక స్థానాల ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎం రేవంత్‌కు టచ్‌లోకి వెళ్లారని అంటున్నారు. అదేసమయంలో వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లోని వారు కూడా.. పార్టీ మారేందు కు రెడీగా ఉన్నారని తెలుస్తోంది. అయితే.. వారి వివరాలు ఇంకా బయటకు పొక్కలేదు. మార్పు ఖాయమ ని మాత్రం తెలుస్తోంది. ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయని తెలుస్తోంది. దీంతో వచ్చే రెండు మూడు వారాల్లోనే బీఆర్ ఎస్ నుంచి భారీ జంపింగులు ఉండే అవకాశం ఉంటుందని సమాచారం.
This post was last modified on July 1, 2024 9:07 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…