Political News

ఏపీకి రాబోతున్న లడ్డా ఐపీఎస్?

మహేష్ చంద్ర లడ్డా ఐపీఎస్… ఈ పేరు ఇరు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితమే. గతంలో ఆంధ్రప్రదేశ్ ఎస్పీగా పనిచేసిన లడ్డా తన మార్క్ పోలీసింగ్ తో రౌడీలు, ఫ్యాక్షనిస్టులు, మావోయిస్టులు, అసాంఘిక శక్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు.

లడ్డా పేరు వింటే క్రైమ్ చేయాలి అనే ఆలోచన కరుడుగట్టిన నేరస్థులకు సైతం రాలేదు అంటే అతిశయోక్తి కాదు. ముక్కుసూటితనం, నిజాయితీ, నిబద్ధత గల పోలీస్ అధికారిగా ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వం నుంచి కూడా లడ్డా మన్ననలు పొందారు. 2019 ఎన్నికల ముందు వరకు ఏపీలో పనిచేసిన ఈ డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఐపీఎస అధికారి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర సర్వీసులకు వెళ్లారు.

అయితే, తాజాగా ఏపీలో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో లడ్డాను మళ్ళీ రాష్ట్ర సర్వీస్ కు పిలిపించాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సీఆర్పీఎఫ్ ఐజీగా పనిచేస్తున్న లడ్డాను రాష్ట్ర సర్వీస్ కి పంపుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ ప్రకారం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. లడ్డాను ఏపీ ఇంటిలిజెంట్ చీఫ్ గా నియమించబోతున్నారని తెలుస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసే సమర్థులైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఏరికోరి ఏపీకి తెచ్చుకుంటున్న క్రమంలో లడ్డా కూడా ఏపీకి రాబోతున్నారు.

ఏపీ క్యాడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి లడ్డా1998 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారు. రాజస్థాన్ లడ్డా స్వస్థలం. విశాఖలో ఏఎస్పీగా కెరీర్ మొదలుబెట్టిన లడ్డా ప్రకాశం, గుంటూరు, నిజామాబాద్ జిల్లాలకు ఎస్పీగా పని చేశారు.

ప్రకాశం జిల్లాలో మావోయిస్టులను అణిచివేయడంలో, శాంతిభద్రతలను పరిరక్షించడంలో లడ్డా తీసుకున్న నిర్ణయాలు అప్పట్లో ప్రశంసలందుకున్నాయి. ఈ క్రమంలోనే 2005 ఏప్రిల్ 27న మహేష్ చంద్ర లడ్డాపై మావోయిస్టులు బాంబు దాడికి పాల్పడగా…ఆయన తృటిలో తప్పించుకొని ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

ఆ తర్వాత గుంటూరు ఎస్పీగా కూడా లడ్డా పనిచేశారు. గుంటూరు జిల్లాలో మావోయిస్టుల ఏరివేతతో పాటు రౌడీయిజంపై, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపారు. ఆ తర్వాత విజయవాడ డిప్యూటీ కమిషనర్ గా కూడా పనిచేసిన అనుభవం లడ్డాకు ఉంది.

2019లో నాటి ప్రతిపక్ష నేత జగన్ పై విశాఖ ఎయిర్పోర్టులో కోడి కత్తి దాడి ఘటన సమయంలో విశాఖ కమిషనర్ గా లడ్డా పనిచేస్తున్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా లడ్డా సెంట్రల్ సర్వీసులకు బదిలీ అయ్యారు.

This post was last modified on June 27, 2024 1:33 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

హైదరాబాద్ ఐమ్యాక్స్ కల తీరనుందా

సంవత్సరాల తరబడి భాగ్యనగర సినిమా ప్రేమికుల కల ఒకటి నెరవేరకుండా అలాగే ఉండిపోయింది. అదే ఐమాక్స్. ఒకప్పుడు ప్రసాద్ మల్టీప్లెక్సులో…

32 mins ago

పంజా దర్శకుడికి నయనతార సడలింపు

అభిమానులు లేడీ సూపర్ స్టార్ గా పిలుచుకునే నయనతార ఆమె హీరోయిన్ గా నటించిన సినిమా అయినా సరే ప్రమోషన్లకు…

2 hours ago

గ‌జ‌ప‌తిరాజుకు ఇది.. రామ‌కృష్ణుడికి అది

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు.. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోటీ నుంచి త‌ప్పుకుని పార్టీ విజ‌యం కోసం క‌ష్ట‌ప‌డ్డ అశోక్ గ‌జ‌ప‌తిరాజు,…

2 hours ago

రాజమౌళికి, మిగతా వాళ్లకు అదే తేడా

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మరోసారి తెలుగు సినిమా గురించి పెద్ద చర్చ నడుస్తోంది. నిన్న రిలీజైన ‘కల్కి 2898 ఏడీ’…

3 hours ago

మాజీ ఎంపీ రమేష్ రథోడ్ ఎంపీ కన్నుమూత

ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రథోడ్ కన్నుమూశారు. నిన్న రాత్రి ఉట్నూర్ లోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో…

3 hours ago

పాత బస్తీకి టెండర్ పెట్టిన రేవంత్?

తెలంగాణ విద్యుత్ రంగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను నష్టాలను పూరించే క్రమంలో బలమైన…

3 hours ago