Political News

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టు

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. గ‌త నెల 13న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న గుంటూరు జిల్లా మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలోని పాల‌వాయి గేటు పోలింగ్ బూత్‌లో ఈవీఎం, వీవీప్యాట్‌ను ధ్వంసం చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఈ ఘ‌ట‌న‌పై ఎన్నిక‌ల సంఘం ప‌లు ప‌లు పార్టీల నాయ‌కులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసు లు కేసులు న‌మోదు చేశారు. అదేస‌మ‌యంలో పోలింగ్ త‌ర్వాత రోజు చోటు చేసుకున్న హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు.. సీఐ నారాయ‌ణ స్వామి దాడి, హ‌త్యాయ‌త్నం జ‌రిగిన‌ట్టు వ‌చ్చిన ఫిర్యాదుల‌తో కూడా.. పోలీసులు కేసు పెట్టారు.

ఇక‌, టీడీపీ పోలింగ్ బూత్ ఏజెంట్ శేష‌గిరిపైనా దాడి చేసి హ‌త్యాయ‌త్నం చేశారంటూ.. పిన్నెల్లి రామ‌కృష్నారెడ్డి, ఆయ‌న సోద‌రుడు వెంక‌ట్రామిరెడ్డిపై కేసులు న‌మోద‌య్యాయి. ఆయా కేసుల్లో ముంద‌స్తు బెయిలు తెచ్చుకున్న పిన్నెల్లి ఇప్ప‌టి వ‌ర‌కు అరెస్టు నుంచి ర‌క్ష‌ణ పొందారు. అయితే.. ఈ ముంద‌స్తు బెయిలు గ‌డువు ముగిసిపోయింది. దీనిని పొడిగించేందుకు హైకోర్టు నిరాకరిం చింది. దీంతో పిన్నెల్లి సోద‌రుల‌ను అరెస్టు చేయాల‌ని ఎస్పీ ఆదేశించారు. దీంతో గుంటూరు పోలీసులు రంగంలోకి దిగి పిన్నెల్లి సోద‌రుల‌ను అరెస్టు చేసే ప్ర‌య‌త్నం చేశారు.

అయితే.. పోలీసుల రాక‌ను గ‌మ‌నించిన వెంక‌ట్రామి రెడ్డి త‌ప్పించుకుని పారిపోగా.. రామ‌కృష్ణారెడ్డి మాత్రం పోలీసుల‌కు చిక్కారు. దీంతో ఆయ‌న‌ను అరెస్టు చేశారు. తొలుత గుంటూరు ఎస్పీ కార్యాల‌యానికి త‌ర‌లించిన అనంత‌రం.. ఆసుప‌త్రికి తీసుకువెళ్లారు. అక్క‌డ వైద్య ప‌రీక్ష‌ల త‌ర్వాత‌.. స్థానిక కోర్టులో ప్ర‌వేశ పెట్టి.. అనంత‌ర చ‌ర్య‌లు తీసుకోనున్నారు. ఇదిలావుంటే.. పిన్నెల్లి అరెస్టు సంద‌ర్భంగా పోలీసులు గుంటూరులోని వైసీపీ కార్యాల‌యం స‌హా.. కీల‌క నేత‌ల ఇళ్ల వ‌ద్ద నిఘా పెట్టారు. ఎలాంటి అల‌జ‌డులు రేగకుండా జాగ్ర‌త్త‌లు చేప‌ట్టారు. గ‌తంలో ముంద‌స్తు బెయిల్ ఇచ్చిన కోర్టు పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డిని సొంత నియోజ‌క‌వ‌ర్గం మాచ‌ర్ల‌లో అడుగు పెట్ట‌కుండా ఆదేశించిన విష‌యం తెలిసిందే. దీంతో ఆయ‌న గుంటూరులోనే ఉంటున్నారు.

This post was last modified on June 26, 2024 8:57 pm

Share

Recent Posts

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

1 hour ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

2 hours ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

2 hours ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

4 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

7 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

9 hours ago