కాల మహిమ అంటే దీన్నే అంటారు. మొన్నటివరకు చంద్రబాబుకు సంబంధించిన ఏమైనా జరిగితే… జస్ట్ సానుభూతి వ్యక్తంచేయాలన్నా రాజకీయం అడ్డొచ్చే పరిస్థితి. రియాక్టు కావాలా? వద్దా? అయితే ఏం జరుగుతుంది? స్పందించకుంటే ఏమవుతుంది? వంటి ధర్మ సందేహాలతో కిందా మీదా పడే పరిస్థితి. అదంతా ఒకప్పుడు. ఇప్పుడు సీన్ మొత్తం మారింది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కీలక ఎన్నికలు ముగిసిపోవటం.. ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో ‘పిక్చర్’ క్లియర్ గా మారింది. మరో ఐదేళ్ల వరకు రాజకీయ ముఖచిత్రంలో మార్పులు ఉండకపోవచ్చు.
గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల వరకు తిరుగులేని అధిక్యతను ప్రదర్శించిన గులాబీ పార్టీకి ఇప్పుడు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఏ రోజున ఏం జరుగుతుందో అర్థం కాక కిందా మీదా పడే పరిస్థితి. అప్పటివరకు వెంట ఉన్నట్లే ఉండి.. ఆ వెంటనే అధికార పార్టీలోకి జంప్ అయిపోతున్న నేతల దెబ్బకు గులాబీ అధినాయకత్వానికి ఒకలాంటి అయోమయం కమ్మేసింది.
గతంలో అధికారం చేతిలో లేకున్నా.. దాన్ని సాధించేంత వరకు శ్రమించటం.. అలుపెరగకుండా పోరాటం చేయటం లాంటివి నేతల్లో ఉండేవి. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. గడిచిన రెండు దశాబ్దాల్లో తెలుగు రాజకీయాల్లో వచ్చిన మార్పుల పుణ్యమా అని.. అధికారం ఎటువైపు ఉంటే అటువైపు వంగిపోవటానికి సిద్ధమవుతున్నారు నేతలు. అధికారపక్ష అధినేతలు సైతం ఈ తీరును ప్రోత్సహించటం.. ప్రత్యర్థి పార్టీలను కోలుకోలేని రీతిలో దెబ్బ తీయాలన్న తపన ఎక్కువైంది. దీంతో.. అధికారం ఎటువైపు ఉంటే అటువైపు వెళ్లిపోవటం ఒక అలవాటుగా మారింది.
పదేళ్లు తమ చేతిలో అధికారం ఉన్న వేళ కేసీఆర్ ఏ విధానాన్ని అనుసరించారో.. ఇప్పుడా పార్టీ నేతలు దాన్నే బాగా వంటబట్టించుకున్న పరిస్థితి. దీంతో.. అధికారంలో లేని తమ పార్టీ నుంచి అధికారం దిశగా ఎలా అడుగులు వేయాలన్నది గులాబీ ఎమ్మెల్యేల ఎదుట పెద్ద టాస్కుగా మారింది. ఇందులో భాగంగా అధికార కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు కొందరు ప్రయత్నాలు షురూ చేస్తుంటే.. మరికొందరి ఆలోచన మరోలా ఉంది. ఇప్పటికిప్పుడు అధికారంలో లేకున్నా.. పరోక్ష అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ.. వచ్చే దఫా అధికారపక్షంగా అవతరించేందుకు ఉన్న అవకాశాల మీద ఫోకస్ చేశారు.
దీనికో ఫార్ములాను సిద్ధం చేసుకున్నారు. ఏపీలో అధికారపక్షంగా అవతరించిన టీడీపీకి అనుబంధంగా తెలంగాణలో ఆ పార్టీ పగ్గాలు అందిపుచ్చుకోవటానికి గులాబీ ఎమ్మెల్యేలు ఇప్పుడు క్యూ కడుతున్నారు. ఇటీవల కాలంలో చంద్రబాబు అపాయింట్ మెంట్ కోసం తెర వెనుక ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. చంద్రబాబు ఓకే అనాలే కానీ.. వెంటనే గులాబీ కారు దిగేయటమే కాదు.. తమతో పాటు అరడజను తక్కువ కాకుండా ఎమ్మెల్యేల్ని తీసుకొని సైకిల్ సవారికి సిద్ధమవుతున్నారు. మరి.. అలా అయితే.. ఉద్యమ నేత ఊరికే ఉండరు కదా? వెంటనే భావోద్వేగ రాజకీయాలకు తెర తీస్తారు కదా? అన్న సందేహం రావొచ్చు. దానికి వారి వద్ద ప్లాన్ సిద్ధంగా ఉంది.
బీఆర్ఎస్ పని అయిపోయిందని.. కేసీఆర్ ను నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరని.. రానున్న రోజుల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పొలిటికల్ సీన్ మారుతుందన్న కొత్త లెక్కల్ని తెర మీదకు తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా సెంట్రల్ లో ఉన్న ఏన్డీయే కూటమి భాగస్వామి అయిన టీడీపీతో జత కట్టటం ద్వారా.. కొన్ని సీట్లను బీజేపీ కేటాయించగా.. కలిసి పోటీ చేయటం ద్వారా ఉమ్మడి ప్రయోజనాల్ని పొందాలన్న ఆలోచనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పలువురు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మొత్తం ప్లాన్ లో మొదటి అడుగు.. టీటీడీపీ అధ్యక్ష పదవిని చేపట్టటం. అందుకే.. చంద్రబాబు టైం కోసం.. ఆయన్ను కలిసేందుకు అవకాశం ఇచ్చే ఫోన్ కాల్ కోసం ఆవురావురమని ఎదురుచూస్తున్న పరిస్థితి. మరి.. దీనికి చంద్రబాబు ఎలా రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
This post was last modified on June 25, 2024 3:28 pm
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…