‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించాడు యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ. ఈ సినిమా అతడికి చాలానే అవకాశాలు తెచ్చిపెట్టింది. అతను ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో ‘హిప్పి’ అనే సినిమా కూడా చేశాడు. ఆ చిత్రంతో తమిళ ప్రేక్షకులకు కాస్త పరిచయం అయ్యాడు. ఇప్పుడు తమిళంలో ఓ భారీ చిత్రంలో అతను కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ఆ చిత్రమే.. వాలిమై. తమిళ బడా హీరోల్లో ఒకడైన అజిత్ ఇందులో హీరో కావడం గమనార్హం.
ఆయనతో ఇంతకుముందు ‘నీర్కొండ పార్వై’ సినిమా (పింక్ రీమేక్) తీసిన వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంత పెద్ద ప్రాజెక్టులోకి కార్తికేయను తీసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే ఈ విషయంపై ఇప్పటిదాకా అధికారిక ప్రకటన అయితే ఏమీ రాలేదు. కానీ కార్తికేయ నిన్న తన పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని చెప్పకనే చెప్పేశాడు.
తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ అజిత్, తాను కలిసి ఉన్న ఫ్యాన్ మేడ్ పోస్టర్‌ను ట్విట్టర్లో షేర్ చేసిన కార్తికేయ.. తన మీద ప్రేమ కురిపిస్తున్న అజిత్ అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాడు. వాళ్లు ఎదురు చూస్తున్న ఒక అదిరిపోయే అప్ డేట్ రాబోతోందని.. కొంచెం ఓపికగా ఉండాలని తమిళ పదాల్లో చెప్పడం విశేషం. ఇంకేం చెప్పాలో అర్థం కావడం లేదని కూడా తమిళంలోనే పేర్కొన్నాడు. #WAITINGFORTHALADHARISANAM అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా జోడించాడు.
మామూలుగానే అజిత్ అభిమానుల హంగామా మామూలుగా ఉండదు. ఇక కార్తికేయ ఇలా ట్వీటేసరికి వాళ్ల హడావుడి ఇంకా పెరిగిపోయింది. కార్తికేయ ట్వీట్‌కు వాళ్లు ఫిదా అయిపోయి ఈ ట్వీట్‌ను పెద్ద ఎత్తున రీట్వీట్ చేశారు. కామెంట్లు పెట్టారు. చాలా తెలివిగా అజిత్ అభిమానుల్ని దువ్వుతున్న కార్తికేయ ‘వాలిమై’తో వాళ్ల అంచనాలను ఏమేర అందుకుంటాడో చూడాలి.
This post was last modified on September 22, 2020 2:00 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…