గత ఐదేళ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని అడ్డు పెట్టుకుని చేసిన అక్రమాలు, అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఐదేళ్ల పాటు తమను వేధించి, అదే పనిగా టార్గెట్ చేసిన వైసీపీకి టీడీపీ-జనసేన ప్రభుత్వం ఇప్పుడు బదులు తీర్చుకునే పనిలో పడింది.
జగన్ అధికారంలోకి రాగానే ప్రభుత్వ భవనమైన ప్రజావేదికను కూల్చి వేయించడమే కాక.. ఆ శిథిలాలను కూడా తొలగించకుండా చంద్రబాబు దాన్ని చూసి కుమిలిపోవాలనే ఎత్తుగడ వేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇంట్లోని ప్రభుత్వ ఫర్నీచర్ విషయంలో కేసులు పెట్టి, వేధించి ఆయన ఆత్మహత్యకు పాల్పడే స్థితికి తీసుకురావడాన్ని టీడీపీ వాళ్లు అంత సులువుగా మరిచిపోలేరు.
కూటమి అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వ ఫర్నీచర్‌ను ఇంకా వాడుకుంటుండడాన్ని బయటపెట్టి ‘ఫర్నీచర్ దొంగ జగన్’ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేశారు.
అంతే కాక నిబంధనలకు విరుద్ధంగా జగన్ తాడేపల్లి ప్యాలెస్‌కు గ్రిల్స్ పెట్టించుకున్న విషయం.. కిలోమీటర్ల కొద్దీ రోడ్డును ఆక్రమించి రాకపోకలు నిషేధించడం.. రుషికొండలో ఏకంగా 550 కోట్లు పెట్టి లగ్జరీ భవనాలను కట్టించుకున్న విషయం.. ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి.
తాజాగా తాడేపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా కట్టుకుంటున్న వైసీసీ సెంట్రల్ ఆఫీస్ వ్యవహారం బయటపడి దాన్ని సీఆర్డీయే కూల్చి వేయగానే వైసీపీ వాళ్లు గగ్గోలు పెడుతున్నారు.
ఇదే సమయంలో విశాఖపట్నంలో కడుతున్న వైసీపీ ఆఫీస్‌కు సంబంధించి మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడ కూడా నిబంధనలకు విరుద్ధంగా.. వైజాగ్ కార్పొరేషన్ అభ్యంతరాలను కూడా పట్టించుకోకుండా వైసీపీ ఆఫీస్ కోసం జగన్ ప్రభుత్వం 1.75 ఏకరాల స్థలాన్ని కట్టబెట్టేసిందట. 33 ఏళ్లకు ఆ స్థలాన్ని ఎకరాకు ఏడాదికి కేవలం వెయ్యి రూపాయల మొత్తానికి లీజుకు ఇచ్చిందట. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బాబు సర్కారు నెక్ట్స్ టార్గెట్ ఇదే అవుతుందా.. ఆ బిల్డింగ్ కూడా కూల్చేస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on June 22, 2024 3:27 pm
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…