ఏపీ నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు కలలు కంటున్న రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ఘట్టాని కి కేంద్రం అనుమతి తెలిపింది. రాజధాని ప్రాంతాన్ని కీలకమైన గుంటూరు, విజయవాడ, ప్రకాశం జిల్లాలో ని కొన్ని ప్రాంతాలకు కలుపుతూ.. నిర్మించే రైల్వే లైన్లకు కేంద్ర సర్కారు తాజాగా పచ్చ జెండా ఊపింది. చిత్రం ఏంటంటే.. చంద్రబాబు శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయం లోనే కేంద్రం నుంచి ఈ సమాచారం అందడం విశేషం.
నవ నగరాలతో ప్రపంచ ప్రఖ్యాత రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలని చంద్రబాబు సంకల్పించిన విషయం తెలిసిందే. అయితే.. ముందుగా.. ప్రధాన నగరాలైన.. గుంటూరు, విజయవాడ, ఒంగోలు వంటి ప్రాంతాలకు.. ఈ నగరాన్ని అనుసంధాన్ని చేయాల్సి ఉంటుంది. కేవలం రోడ్డు మార్గమే కాకుండా.. రైలు లైను కూడా వేయాలన్నది చంద్రబాబు బృహత్తర ప్రణాళిక.. దీని ప్రకారమే ఆయన 2017-18లో నే ఈ ప్రణాళికలను కేంద్రానికి అందించారు.
అయితే.. తర్వాత కాలంలో బాబుకు కేంద్రానికి మధ్య వివాదం తలెత్తడంతో ఇది ఆగిపోయింది. తర్వాత వచ్చిన వైసీపీ పట్టించుకోలేదు. దీంతో తాజాగా కూటమిగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. చంద్రబాబు అమరావతి ప్లానును.. రైల్వేకు అప్పగించారు. ఈ క్రమంలోనే రైల్వే శాఖ.. అమరావతి నూతన లైన్లకు సంబంధించి.. ప్రకటన విడుదల చేసింది.
ఇవీ.. ప్రతిపాదిత లైన్లు..
అనుమతులు ఇవీ..
This post was last modified on June 21, 2024 3:45 pm
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…