వైసీపీ హయాంలో తన ఇంటినే కార్యాలయంగా మార్చుకుని అక్కడి నుంచే అప్పటిసీఎం జగన్‌పాలన చేసిన విషయం తెలిసిందే. దీంతో అధికారికంగా.. ఆయన కార్యాలయంలో ఫర్నిచర్.. ఇతర మౌలిక సదుపాయాలను కల్పించారు. అయితే.. తాజాగా వైసీపీ సర్కారు కుప్పకూలడంతో ప్రభుత్వ ధనంతో కొనుగోలు చేసిన ఫర్నిచర్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రాజకీయ దుమారం కూడా రేగింది.
గతంలో స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇలానే ఫర్నిచర్ తన ఇంట్లో ఉంచుకుంటే.. ఆయనపై దొంగ అని ము ద్ర వేశారని, ఇప్పుడు జగన్ కూడా అలాంటి పనే చేశారు కాబట్టి.. ఆయనపైనా దొంగతనం కేసు పెట్టాలం టూ.. కొందరు టీడీపీ నాయకులు.. సహా కోడెల కుమారుడు శివరామకృష్ణ కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా రియాక్ట్ అయింది. లెక్కకట్టండి సొమ్ములు చెల్లిస్తాం
అంటూ.. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చంద్రబాబు సర్కారుకు లేఖరాశారు.
అయితే..దీనిపై సుదీర్ఘ మంతనాలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా జగన్ కార్యాలయానికి లేఖ రాసింది. డబ్బులు వద్దులే.. సామాన్లు తిరిగి ఇచ్చేయండి
అని పేర్కొంది. దీంతో జగన్ కార్యాలయం ఇప్పుడు ఫర్నిచర్‌ను ప్రభుత్వానికి పంపించే ఏర్పాట్లు చేస్తోంది. అయితే.. ఈ ఫర్నిచర్‌కొంత డ్యామేజీ అయినట్టు తెలుస్తోంది. దీంతో డ్యామేజీ అయిన ఫర్నిచర్ వరకు లెక్క కట్టి సొమ్ము చెల్లిస్తారా? లేక.. ఏం చేస్తారనేది చూడాలి.ఏదేమైనా.. ఫర్నిచర్‌వివాదానికి చంద్రబాబు తనదైన శైలిలో చెక్ పెట్టారు.
This post was last modified on June 19, 2024 2:25 pm
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…
రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉందని.. అయితే..దీనిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా…