టీడీపీ అధినేత చంద్రబాబు అంటే.. ఇప్పుడు అందరికీ ఆరాధ్యుడిగా మారిపోయారు. గత 2014-19 మధ్య ఆయన పాలన చేశారు. ఆయన పాలన ఉమ్మడి ఏపీకి, విభజిత ఏపీకి కూడా కొత్తకాదు. కానీ, ఇప్పుడు మాత్రమే చంద్రబాబు కు ఎనలేని.. గుర్తింపు.. ప్రజల్లోనూ ఆరాధ్య భావం రెట్టింపు అయ్యాయి. సాధారణం గా చంద్రబాబుపై సానుభూతి ఉండడం వేరు.. కానీ, ఇప్పుడు మాత్రం చంద్రబాబు అంటే.. ఒక రకమైన పిచ్చి ఏర్పడింది. మరి దీనికి కారణం ఏంటి?
1) తనను తాను తగ్గించుకోవడం: సీనియార్టీ పరంగా చూస్తే.. ఉమ్మడి ఏపీ నుంచి విభజిత ఏపీ వరకు.. ముఖ్యమంత్రి అయిన వారిలో ఎన్టీఆర్ తర్వాత.. చంద్రబాబే సీనియర్‌గా ఉన్నారు. ఈ భావనతోనే గతంలో ఆయన కొంత డిస్టెన్స్ పాటించారు. కానీ, ఇప్పుడు ఆ హద్దులు చెరిపి వేశారు. అందరికీ చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. తనను తాను తగ్గించుకుని.,. తాను ఎక్కువ కాదనే సందేశాన్ని పంపిస్తున్నారు. కూటమి పార్టీలతో కలివిడిగా ఉంటున్నారు.
2) ఫీల్ గుడ్: చంద్రబాబు హయాంలో వ్యాపారాలు.. సంస్థల ఏర్పాటు విషయంలో ఫీల్ గుడ్ అనే భావన పెరుగుతుంది. ఇది గతంలోనూ ఉంది. అయితే.. అప్పటికి ఇప్పటికి మరింత మార్పు అయితే.. కనిపిస్తోంది. దీంతో చంద్రబాబు పాలన విషయంలో వ్యాపార వేత్తలు.. మరింత ముందుకు వస్తున్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఫీల్ గుడ్ కారణంగానే రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందనే వాదన కూడా వినిపిస్తోంది.
3) పోలీసింగ్: రాష్ట్రంలో శాంతి భద్రతలకు పెద్దపీట వేయడంలో చంద్రబాబు ముందున్నారు. గతంలో ఫ్యాక్షన్ జిల్లాలుగా పేరున్న కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఎక్కడికక్కడ ఆయన ఫ్యాక్షన్‌ను అణిచేశారు. ఎక్కడా ఎవరిపైనా రాజకీయ ప్రతీకారేచ్ఛతో రగిలిపోయిన సందర్భాలు కూడా లేవు. ఇది ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. ముందుగానే ఆయన పోలీసును ఈ విషయంలో హెచ్చరించారు. ఇది కూడా.. సాధారణ ప్రజల్లో చంద్రబాబును హైలెట్ చేస్తోంది. దీంతో బాబు పాలనపై పిచ్చి పెరిగిపోయిందని వాదన వినిపిస్తోంది.
This post was last modified on June 19, 2024 3:37 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…
రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉందని.. అయితే..దీనిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా…
టాలీవుడ్ లో వరస అవకాశాలు వస్తున్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి టాప్ త్రీలో ఉంది. హిట్లు ఫ్లాపులు పక్కనపెడితే కాల్…
జగన్ హయాంలో అనేక తప్పులు జరిగాయని సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే.. మరీ ముఖ్యంగా కొన్ని తప్పుల కారణంగా.. రాష్ట్రం…
సూర్య ప్యాన్ ఇండియా మూవీ కంగువాకు బాక్సాఫీస్ వద్ద వస్తున్న స్పందన చూసి అభిమానులు సంతోషంగా లేరన్నది ఓపెన్ సీక్రెట్.…
కాపు ఉద్యమ మాజీ నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం.. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్రంలో…