వైసీపీ అధినేత, తాజా మాజీ సీఎం జగన్.. తన మనసు మార్చుకున్నారు. అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వాస్తవానికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమదే విజయమని జగన్ భావించారు. అందుకే.. చాలా హుషారుగా ఆయన ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత.. లండన్ సహా విదేశీ పర్యటనకు వెళ్లారు. కానీ, ఆయన ఆశించినట్టు ఫలితం రాలేదు. పూర్తిస్థాయి మెజారిటీ దక్కక పోయినా.. కనీస మెజారిటీతో అయినా.. ఒడ్డున పడతామని భావించిన వైసీపీ నాయకులు జనాలు షాకిచ్చారు. ప్రతి పక్ష హోదా కూడా దక్కని రీతిలో 11 స్థానాలకు పరిమితం. ప్రధాన ప్రతిపక్షం హోదా దక్కాలంటే 15 శాతం సీట్లు ఉండాలి.
అంటే వైసీపీకి కనీసం 18 స్థానాలు దక్కి ఉండాలి. కానీ, ప్రజలు మాత్రం వైసీపీని 11 స్థానాలకే పరిమితం చేశారు. దీంతో 151 స్థానాలతో గంభీరంగా అసెంబ్లీలో అడుగు పెట్టిన జగన్.. ఇప్పుడు 11 మందితో అసెంబ్లీకి వెళ్లాలంటే.. తీవ్ర అవమానంగా వైసీపీ నాయకులు భావించారు. దాదాపు జగన్ కూడా ఇదే విషయంపై అంతర్మథనం చెందారు. ఇక, అసెంబ్లీకి వెళ్లరాదని.. త్వరలోనే ప్రజల్లోకి వెళ్లాలని కూడా ఆయన నిర్ణయించుకున్నట్టు తాడేపల్లి వర్గాలు చెప్పాయి. కానీ, తర్వాత.. మేదావులు. సలహాదారులను సంప్రదించగా.. ఇలా చేస్తే.. వైసీపీపై అధికార పక్షం మరింత దాడి చేస్తుందన్న సూచనలు వచ్చాయి.
దీంతో తాజాగా జగన్ మనసు మార్చుకున్నారు. త్వరలోనే ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తన షెడ్యూల్లోనూ మార్పులు చేసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని అనుకున్న ఆయన దీనిని ఈనెల 22కు బదులుగా ఈనెల 20నే నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టు పార్టీ తెలిపింది. ఇటీవలి ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీచేసిన అభ్యర్థులు ఆ రోజు తప్పనిసరిగా హాజరు కావాలని పేర్కొంది.
అలాగే పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీచేసిన అభ్యర్థులు(ఎంపీలు మినహా) ఈ సమావేశానికి హాజరవుతారు. ఇక, బుధవా రం పులివెందుల పర్యటనకు వెళ్లాల్సిన మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి దీనిని కూడా వాయిదా వేసుకున్నారు. దీనిని బట్టి.. జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు మానసికంగా సిద్ధమయ్యారనే చర్చ సాగుతోంది.
This post was last modified on June 19, 2024 9:40 am
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ తర్వాత నవీన్ పోలిశెట్టి నుంచి మళ్ళీ ఇంకో సినిమా రాలేదు. గ్యాప్…
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్…
జవాన్ దర్శకుడు అట్లీ బ్రాండ్ ని నిర్మాతగా వాడుకున్నారు. వరుణ్ ధావన్ అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్లా…
కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీల మధ్య కొన్ని…
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి, ముఖ్యమంత్రి కావడానికి సింపతీ బాగా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. తన తండ్రి వైఎస్…
సీఎం చంద్రబాబు .. రాజధాని అమరావతికి బ్రాండ్ అని అందరూ అనుకుంటారు. కానీ, ఆయన అనుకుంటే.. దేనికైనా బ్రాండ్ కాగలరని…