Political News

పోలవరం నాకు అర్థం కాలేదు-అంబటి

ఆంధ్రప్రదే‌శ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలో ఉండగా.. రాష్ట్రానికి జీవనాడి కాగలదనుకున్న పోలవరం ప్రాజెక్టును ఎంత నిర్లక్ష్యం చేసిందో తెలిసిందే. చంద్రబాబు హయాంలో 75 శాతం దాకా ప్రాజెక్టు పూర్తి కాగా అదే స్థాయిలో కృషి కొనసాగి ఉంటే 2022లోనే రైతులకు ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇచ్చే అవకాశం ఉండేది. జగన్ హయాంలో ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి.

తొలి రెండున్నరేళ్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ కానీ.. ఆ తర్వాత ఆ మంత్రిత్వ శాఖను నడిపిన అంబటి రాంబాబు కానీ ఈ ప్రాజెక్టును పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. పోలవరానికి సంబంధించి మీడియా వాళ్లు ప్రశ్నలు వేస్తే.. తనకు సబ్జెక్ట్ తెలియదని.. మీరు ప్రశ్నలు అడిగితే నేను సమాధానం చెప్పాలా అని ప్రశ్నించిన ఘనత అంబటికే దక్కుతుంది.

కాగా అధికారం కోల్పోయి ఇప్పుడు మాజీ అయ్యాక కూడా అంబటి రాంబాబు తీరు మారలేదు. నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటన చేసిన అనంతరం ప్రెస్ మీట్ పెట్టి జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన నష్టం గురించి వివరించారు. 2022లోనే నీళ్లు ఇవ్వాల్సిన ప్రాజెక్టు ఇంకో నాలుగేళ్లకు కానీ పూర్తయ్యే అవకాశం లేదని చెబుతూ ఆవేదన చెందారు. దీనికి కౌంటర్‌గా ఈ రోజు అంబటి ప్రెస్ మీట్ పెట్టి.. ఇప్పుడు చంద్రబాబు చెప్పిందే తాను గతంలో చెప్పానని చెప్పుకొచ్చారు.

తాను ఇరిగేషన్ మినిస్టర్ అయ్యాక చాలామంది నిపుణులతో మాట్లాడానని.. వాళ్లందరితో మాట్లాడాక అర్థమైంది ఏంటంటే.. ఈ ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తి కాదని, అదే విషయాన్ని తాను మొట్టమొదటగా చెప్పానని.. చంద్రబాబు ఇప్పుడు చెబుతున్నానని అంబటి అన్నారు. పోలవరం ప్రాజెక్టు అసలు ఎవ్వరికీ అర్థం కాదని.. ఎందుకంటే అది తనకు అర్థం కాలేదని అంబటి ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం.

కొసమెరుపు ఏంటంటే… చంద్రబాబు నిన్న చెప్పింది నాశనం చేశారు దీనిని అర్థం చేసుకుని మళ్లీ డ్యామేజీ కంట్రోల్ చేసి పునర్నిర్మాణం చేయడానికి చాలా కాలం పట్టొచ్చు, నాలుగేళ్లు అవ్వచ్చు అన్నారు. అంటే త్వరలో ఒక నివేదిక వచ్చాక సమయం చెప్పొచ్చు అన్నది చంద్రబాబు భావన. కానీ ముందే కూసిన కోయిలలా చూశావా నేను చెప్పిందే చంద్రబాబు చెప్పాడు అంటూ అంబటి తొందరపడ్డారు.

This post was last modified on June 18, 2024 6:17 pm

Share

Recent Posts

80′ s ట్రెండ్… చంద్రబాబు రూటే సెపరేటు

సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్‌’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…

12 minutes ago

AI కోసం లక్షల కోట్లు… లాభాలు రాకపోతే ఏం జరుగుతుంది?

చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…

1 hour ago

జగన్ లోనూ ఓ కాక్రోచ్

నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…

2 hours ago

వృషకర్మ… తెలివైన పని చేసిందమ్మ

ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…

2 hours ago

యూపీఐ లో కొత్త షార్ట్‌కట్… స్కాన్ లేకుండానే పేమెంట్

షాప్‌లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…

3 hours ago

రావిపూడి మార్కు మళ్ళీ మొదలయ్యింది

ఎవరు ఏమన్నా, ఎన్ని కామెంట్లు చేసినా దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలైతే చాలా ఉన్నాయి. మొదటిది కమిట్…

4 hours ago