Political News

ఇంకా ప‌ర‌దాలు అలవాటు వదలని అధికారులు

ఏపీ స‌ర్కారులో గ‌త ఐదేళ్లుగా కొన్ని అలవాట్ల‌కు అలవాటు ప‌డిన అధికారులు.. ఇంకా వాటిని వ‌దిలించుకోలేక పోతున్నారు. ప‌దేప‌దే టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబు చెబుతున్నా.. స‌ద‌రు పాత వాస‌న‌ల‌ను వారువ‌దిలి పెట్ట‌లేక పోతున్నారు.

సీఎంగా చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారం జ‌రిగిన త‌ర్వాత‌.. చోటు చేసుకున్న రెండు కీల‌క ప‌రిణామాల‌పై ఇప్పుడు స‌ర్కారు కూడా తీవ్రంగా స్పందించింది. దీనిలో ప్ర‌ధానంగా.. ప‌రదాలు క‌ట్ట‌డం. రెండోది ట్రాఫిక్‌ను గంట‌ల‌కొద్దీ నిలిపి వేయ‌డం. ఈ రెండు విష‌యాల‌పై చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌కముందే అధికారుల‌ను హెచ్చ‌
రించారు. అలా చేయొద్ద‌ని కూడా చెప్పారు.

గ‌తంలో జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఎవ‌రు స‌ల‌హా ఇచ్చారో.. ఏమోకానీ.. ఆయ‌న బ‌య‌ట‌కు వ‌స్తే చాలు.. పోలీసులు అతిగా వ్య‌వ‌హ‌రించారు. ఆయ‌న ప‌ర్య‌టించే ప్రాంతాల్లో 10 అడుగుల ఎత్తున ప‌ర‌దాలు క‌ట్టేసేవారు. దీంతో ఆయ‌న‌కు చుట్టూ కూడా.. అంతా బాగున్న‌ట్టుగా ఉండేది.

ఇక‌, జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో కీల‌క విష‌యం చెట్టు న‌రికేయ‌డం. చిన్న‌దనీ లేదు.. పెద్ద‌ద‌నీ లేదు. అడ్డం వ‌చ్చింద‌ని లేదు.. అవ‌స‌రం లేద‌ని కూడా లేదు. చెట్టుఏదైనా.. ఎన్నేళ్ల‌యినా.. జ‌గ‌న్ వ‌స్తున్న మార్గంలో వాటిని శ‌త్రువుల‌గా చూశారు. తెగ‌న‌రికేశారు.

ఇక‌, జ‌గ‌న్ ఆకాశంలో హెలికాప్ట‌ర్ ద్వారా ప్ర‌యాణించినా.. రోడ్డుపై ఆయ‌న కాన్వాయ్‌లో వెళ్లినా.. గంట‌ల కొద్దీ వాహ‌నాల‌ను నిలిపివేసేవారు. అంతేకాదు.. ఆయ‌న ప‌ర్య‌టించే ప్రాంతాల్లో దుకాణాల‌ను బంద్ చేయించేవారు. రోడ్ల‌పై చిరు వ్యాపారాలు చేసుకుని పొట్ట పోసుకునేవారిని కూడా వ‌దిలి పెట్టేవారు.

క‌ట్ చేస్తే.. ఇవ‌న్నీ.. జ‌గ‌న్ స‌ర్కారుకు ఎస‌రు పెట్టాయి. వీటిని గ‌మ‌నించిన చంద్ర‌బాబు.. తాను గెలిచీ గెల‌వ‌గానే.. సంబంధిత అధికారుల‌కు సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేశారు. ప‌ర‌దాలు క‌ట్ట‌ద్ద‌ని, చెట్లు న‌ర‌కొద్ద‌ని.. ట్రాఫిక్‌ను ఆపి.. ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెట్ట‌ద్ద‌ని కూడా చెప్పారు.

కానీ, అధికారులు ఏమ‌నుకున్నారో.. ఏమో.. జ‌గ‌న్ పాల‌నే ఉంద‌ని భావించారో ఏమో.. తాజాగా తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌లో సీఎం చంద్ర‌బాబు వ‌స్తున్న మార్గంలో ప‌ర‌దాలు క‌ట్టారు. దుకాణాలు బంద్ చేయించారు. ఈ విష‌యంలో ఆల‌స్యంగా తెలిసిన నారా లోకేష్‌.. ఇలా ఎందుకు చేస్తున్నార‌ని పోలీసుల‌ను ప్ర‌శ్నించారు. వెంట‌నే వాటిని ఆపాల‌ని కూడా అన్నారు.

ఇక‌, గురువారం మ‌ధ్యాహ్నం.. విజ‌య‌వాడ దుర్గ‌గుడి ద‌ర్శ‌నానికి చంద్ర‌బాబు కుటుంబం రానుంది. ఈ నేప‌థ్యంలో భ‌క్తుల‌ను గంట‌ల కొద్దీ లైన్ల‌లోనే కిక్కిరిసిపోయేలా వ్య‌వ‌హ‌రించారు అధికారులు. అంతేకాదు.. విజ‌య‌వాడ‌లోనూ ట్రాఫిక్‌నిలిపి వేశారు. దీంతో అధికారుల తీరు మార‌డం లేద‌ని. టీడీపీ నాయ‌కులు పేర్కొంటున్నారు. వీరికి షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వాల్సిందేన‌ని అంటున్నారు.

This post was last modified on June 13, 2024 2:39 pm

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

ఏపీలో.. టైం టేబుల్ పాల‌న‌!!

సాధార‌ణంగా ప్ర‌తి ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేసుకుని పోతుంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్ర‌ణాళిక‌లు.. కొన్ని…

28 minutes ago

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

7 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

8 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

9 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

12 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

12 hours ago