సత్యకుమార్ యాదవ్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఈ పేరు ఇప్పుడు సంచలనం. అనంతపురం జిల్లా ధర్మవరం నుండి అనూహ్యంగా పోటీకి దిగడమే కాకుండా అక్కడ తిరుగులేదు అనుకున్న కేతిరెడ్డి వెంకట్రామ్ రెడ్డి మీద అదీ బీజేపీ తరపున పోటీ చేసి 3734 ఓట్ల స్వల్ప మెజారిటీతో సంచలన విజయం సాధించాడు. ఇప్పుడు ఏకంగా బాబు క్యాబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. బీజేపీ తరపున గెలిచిన ఎనిమిది మందిలో సత్యకుమార్ కు అవకాశం దక్కడం విశేషం.
బీజేపీ తరపున కీలకమైన జమ్మలమడుగు నుండి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, విజయవాడ దక్షిణం నుండి సుజనా చౌదరి, విశాఖ నార్త్ నుేండి పెన్మత్స విష్ణుకుమార్ రెడ్డి, ఆదోని నుండి పార్దసారధి, ఎచ్చెర్ల నుండి ఈశ్వరరావు, కైకలూరు నుండి కామినేని శ్రీనివాస్, అనపర్తి నుండి నల్లమిల్లి రామక్రిష్ణారెడ్డిలు గెలిచినా మంత్రి పదవి సత్యకుమార్ కు దక్కడంతో అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు.
సత్య అలియాస్ సత్యకుమార్ అనే పేరు ఢిల్లీ రాజకీయ వర్గాలలో పరిచయం అక్కర్లేని పేరు. మహారాష్ట్ర నుండి వలసవచ్చిన సత్యకుమార్ పూర్వీకులు హిందూపూర్ లో స్థిరపడ్డారు. వెంకయ్యనాయుడు వ్యక్తిగత కార్యదర్శిగా సుధీర్ఘకాలం పనిచేసిన ఆయన వెంకయ్యనాయుడు రాజకీయాల నుండి తప్పుకున్న అనంతరరం పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. విద్యార్ధి దశ నుంచి ఏబీవీపీలో చురుగ్గా ఉండటంతో బీజేపీ నాయకత్వంతో, తెలుగు, కన్నడ, మరాఠీ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడగలగడంతో అన్ని రాష్ట్రాల నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
వెంకయ్యనాయుడు బీజేపీ జాతీయాధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో, వాజ్ పేయి ప్రభుత్వంలో పనిచేసిన సమంలో, యూపీఏ ప్రభుత్వ హయాంలోనూ సత్యకుమార్ ఆయన వెన్నంటే ఉన్నారు. నమ్మిన బంటుగా ఉన్న సత్యకుమార్ కు వెంకయ్య నాయుడు ఏకంగా తన సమీప బంధువుతో వివాహం జరిపించి మరీ అక్కున చేర్చుకోవడం విశేషం.
2022 మార్చి ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో 403 శాసనసభ స్థానాలకు జరిగిన ఎన్నికలలో బీజేపీ తరపున సత్యకుమార్ 135 స్థానాలకు బాధ్యుడిగా వ్యవహరించాడు. ఈ ఎన్నికల్లో ఎన్డీఎ కూటమి ఏకంగా 284 స్థానాలలో విజయం సాధించడం విశేషం. ఇందులో బీజేపీ 252, భాగస్వామ్య పక్షాలు 32 స్థానాలలో విజయం సాధించాయి. ఇంత నేపథ్యం ఉంది కాబట్లే సత్యకుమార్ ఈసారి ఏపీ మంత్రిగా అవకాశం దక్కించుకున్నాడని చెప్పాలి.
This post was last modified on June 12, 2024 10:04 am
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…