ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం నేడు కొలువుదీరనున్న సంగతి తెలిసిందే. ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం 11.47 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కేబినెట్ లో ఉండబోయే మంత్రులు ఎవరు అన్నదానిపై నిన్న అర్ధరాత్రి వరకు చంద్రబాబు, పవన్ చర్చించారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ రోజు చంద్రబాబుతోపాటు ప్రమాణం చేయనున్న 24 మంది మంత్రుల జాబితా విడుదలైంది. ఒక స్థానాన్ని ఖాళీగా ఉంచారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
ఎన్డీఏ కూటమిలో కీలకమైన జనసేనకు 3 మంత్రి పదవులను కేటాయించారు. బీజేపీకి ఒక స్థానం దక్కింది. మంత్రివర్గంలో 17 మంది కొత్త వారికి చంద్రబాబు అవకాశమిచ్చారు. సామాజిక వర్గాల వారీగా అన్ని వర్గాలను బ్యాలెన్స్ చేస్తూ మంత్రివర్గ కూర్పు చేశారు. నలుగురు కాపులు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్లు..ముగ్గురు మహిళలు, 8 మంది బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఒక ఎస్టీ, ఒఖ ముస్లిం మైనారిటీ, ఒక వైశ్య…ఇలా అందరినీ సంతృప్తి పరిచేలా కేబినెట్ కూర్పు జరిగింది. సీనియర్, యువ నాయకుల మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గ కూర్పు చేశారు.
కొత్త మంత్రుల జాబితా ఇదే
This post was last modified on June 12, 2024 9:16 am
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…