ఏపీలో తన సోదరుడి ప్రభుత్వాన్ని గద్దె దింపడంలో కీలకపాత్ర పోషించిన కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల ఇప్పుడు మరోసారి విజృంభించేందుకు రెడీ అవుతున్నారా? తెరవెనుక పూర్తిస్థాయిలో మంతనాలు సాగుతున్నాయా? ఆమె దూకుడుతో.. వైసీపీ మూలాలు కదిలిపోయే ప్రమాదం దాపురించిందా? అంటే ఔననే అంటున్నారు రాజకీయ పండితులు. రాష్ట్రంలో మారుతున్న పరిణామాలు.. కనిపిస్తున్న అవకాశాలు వంటివి పెద్ద ఎత్తున వైసీపీకి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.
వైసీపీ అధికారం కోల్పోయి.. వారం రోజులు అయింది. అయితే.. ఇప్పటి వరకు వైసీపీ ఓటమికి బాధ్యులు ఎవరనే విషయంపై చర్చ సాగుతూనే ఉంది. అయితే.. కొందరు మాత్రం ఇప్పటికే తమ ఓటమికి జగన్ కారణమని తేల్చేశారు. ముఖ్యంగా సీమ ప్రాంత రెడ్డి సామాజికవర్గం జగన్ వైఖరిపై నిప్పులు చెరుగుతోంది. అందుకే ఇన్ని రోజులు గడిచినా.. ఇప్పటి వరకు సీమ ప్రాంతానికి చెందిన కీలకరెడ్డి నాయకులు ఎవరూ కూడా.. జగన్‌ను కలుసుకునేందుకు రాలేదు.
ఈ పరిణామాల వెనుక వ్యూహాత్మక రాజకీయం సాగుతోందని పరిశీలకులు చెబుతున్నారు. షర్మిలను రంగంలోకి దింపి.. కీలక రెడ్డి సామాజిక వర్గాన్ని మరోసారి కాంగ్రెస్ వైపు మళ్లిస్తారనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం సైలెంట్గా ఉన్నప్పటికీ తెరవెనుక చేయాల్సిన పనులు జరుగుతున్నాయని అంటున్నారు. త్వరలోనే షర్మిలకు రాజ్యసభ టికెట్ ఇవ్వనున్నట్టు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు కూడా చెబుతున్నాయి. దీంతో షర్మిల మరింత యాక్టివ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
అనంతరం.. వైసీపీలోకి కీలక నాయకులను ఆకర్షించే ప్రయత్నం చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు ఆమె టచ్‌లోకి వెళ్లారని చెబుతున్నారు. అందుకే కీలకమైన రెడ్డి సామాజిక వర్గం మౌనంగా ఉందని తెలుస్తోంది. వీరు కనుక సంఘటితమైతే.. వైఎస్ వారసురాలిగా షర్మిలను గుర్తించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఇదే జరిగితే.. వైసీపీలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం ఆమెను నాయకురాలిగా గుర్తించే అవకాశం ఉంటుందని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on June 11, 2024 7:54 pm
గత ఏడాది టీజర్ కొచ్చిన నెగటివ్ రెస్పాన్స్ దెబ్బకు వీడియో ప్రమోషన్లకు దూరంగా ఉన్న విశ్వంభర ఎట్టకేలకు ఇవాళ హనుమాన్…
ఏపీలోని పొలిటికల్ కేపిటల్ విజవాయడలో శనివారం ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో ఆ…
అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ ఆనంద్ షా వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై గ్యాంబ్లింగ్ మాఫియా…
ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న స్పిరిట్ కు రంగం సిద్ధమవుతోంది. చేతిలో ఉన్న ఫౌజీ, ది రాజా సాబ్…
రెండేళ్ల క్రితం బేబీ రిలీజ్ ముందు వరకు తనెవరో పెద్దగా పరిచయం లేని పేరు. అల వైకుంఠపురములో అల్లు అర్జున్…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ... అధికార డీఎంకేలో ఫుల్ జోష్ నింపే పరిణామం ఒకటి శనివారం జరిగింది. సుప్రీంకోర్టులో రెండేళ్లుగా…