బాబు తొలి మూడు సంతకాలు ఇవే ?!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 164 స్థానాలలో కూటమి విజయం సాధించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఉన్న కేసరపల్లి ఐటీపార్క్ వద్ద జూన్ 12 ఉదయం 11:27 నిమిషాలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు మొదట ఏ ఫైళ్ల మీద సంతకం చేస్తాడు అన్న ప్రశ్నలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా మూడు ఫైళ్ల మీద సంతకం చేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీపై ఉండనున్నట్లు తెలుస్తుంది. మెగా డీఎస్సీ అంటూ వైసీపీ మోసం చేసిందని తాము అధికారంలోకి రాగానే ఫస్ట్ సంతకం మెగా డీఎస్సీపైనే ఉంటుందని టీడీపీ పలు సభల్లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో తొలి సంతకం మెగా డీఎస్సీ మీదనే అని అంటున్నారు.

ఇక రెండో సంతకం పింఛన్ల పెంపు మీద ఉండే అవకాశం ఉంది. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పింఛన్లు నాలుగు వేలకు పెంచుతామని, దీనిని ఏప్రిల్ నెల నుంచే అమలు ప్రకటించారు. ఏప్రిల్, మే, జూన్ మూడు నెలలకు నెలకు వేయి చొప్పున అదనంగా రావాల్సిన పింఛన్‌ను కలిపి జూన్ నెల పింఛన్ 7 వేలు అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఎన్నికల హామిల్లో భాగమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మూడో సంతకం చేసే అవకాశం ఉంది.