సంపాదకీయం… నేటి భాషలో చెప్పాలంటే ఎడిటోరియల్!. ఈనాడు ప్రారంభానికి ముందు కూడా అనేక పత్రికలు ఉన్నాయి. అనేక మంది మహామహులు ఎడిటోరియల్స్ రాసేవారు. అయితే.. అవన్నీ ఓ మూస ధోరణిలోనే ముందుకు సాగాయి. దీంతో సంపాదకీయం అంటే.. పత్రిక చెప్పే.. అభిప్రాయంగా మారిపో యింది. దీంతో అది కూడా.. ఒక వార్త లేదా.. విశ్లేషణగా ఒక వ్యక్తి అభిప్రాయంగా మాత్రమే నిలిచిపోయిం ది. దీంతో సంపాదకీయాలు పెద్దగా ప్రజల్లోకి చేరలేక పోయాయి.
కానీ, ఈనాడు ప్రారంభంతో సంపాదకీయాలకు ఒక్క కొత్త ఒరవడి వచ్చి చేరింది. సంపాదకీయం అంటే. వ్యక్తి అభిప్రాయం కాదు.. సమాజ అభిప్రాయం.. సగటు పౌరుడి అభిప్రాయం అనేలా .. ఈనాడు సంపాద కీయాలను తీర్చిదిద్దారు రామోజీ. అప్పటి వరకు జరిగిన పరిణామాలను గుదిగుచ్చి.. వాటిపై సామాన్యుడు ఎలా స్పందిస్తాడో..అచ్చం అలానే స్పందించారు. స్వయంగా ఆయనే మూడు దశాబ్దాల పాటు సంపాద కీయాలు రాస్తూ వచ్చారు.
అంతేకాదు.. సంపాదకీయం అంటే.. తేలికగా ఉండకూడదనే ధోరణే ధోరణితో.. బలమైన వాడుక భాషతో.. అంతేబలమైన పదాలతో సందర్భోచితంగా.. రాసుకున్న సంపాదకీయాలు అనేక మంది సాహితీవేత్తలను కూడా.. అబ్బుర పరిచాయి. తొలినాళ్లలో ప్రముఖ కవి వేటూరి సుందరరామమూర్తిని కేవలం సంపాదకీయా ల పర్యవేక్షక బోర్డులో ఉద్యోగిగా చేర్చుకున్నారు. తర్వాత.. ఆచార్య కొనకలూరి ఇనాక్ నుంచి ఆచార్య సి. నారాయణరెడ్డి వరకు అనేక మంది సాహితీవేత్తలు సంపాదకీయాలకు సరుకు అందించారు.
అందుకే.. ఈనాడు సంపాదకీయం అంటే..పత్రికకే కాదు.. నేటికీ పాత్రికేయానికి.. మణిమకుటంగా నిలిచి పోయేలా చేయగలిగారు రామోజీ. సమస్యను ప్రస్తావించడమే కాదు… పరిష్కారం చూపించడంలోనూ సంపాదకత్వం బాధ్యతను ఆయన సంపూర్ణంగా నెరవేర్చారు. నేటికీ తెలుగు పత్రికల్లో సంపాదకీయం అంటే.. ఈనాడు.. ఈనాడు అంటే సంపాదకీయం! అనే మాట వినిపిస్తుంది. అంత అద్భుతంగా.. ఈనాడు ఆత్మను సంపాదకీయంలో కూర్చి.. అక్షరాలు పేర్చి.. ప్రజా బాహుళ్యానికి గుండె చప్పుడు అయ్యారు.
This post was last modified on June 8, 2024 3:37 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…