వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసేందుకు రంగం రెడీ అయింది. హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ గడువు బుధవారంతో తీరిపోతుంది. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు పిన్నెల్లికి సంబంధించిన కేసులను గురువారం హైకోర్టు మరోసారి విచారించనుంది. ఈ నేపథ్యంలో కఠిన చర్యలు, ఆదేశాలు కూడా ఉంటాయని న్యాయ నిపుణులు అంటున్నారు.
ఏం జరిగింది?
గత నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయంలో మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేటు బూత్‌లో ఈవీఎం, వీవీ ప్యాట్‌ను ధ్వంసం చేయడం, దీనిని అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ శేషగిరి రావుపై దాడి చేయడం.. చివరకు హత్యాయత్నం చేయడం.. వంటివి పిన్నెల్లి ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు సీఐ నారాయణ స్వామి పైనా హత్యాయత్న జరిగిందని.. దీనికి కారణం కూడా.. పిన్నెల్లేనని పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనిపై ఏర్పాటైన సిట్ పలు నివేదికలు కూడా ఇచ్చింది.
ఈ క్రమంలో పరారైన పిన్నెల్లి.. తనను పోలీసులు అరెస్టు చేయకుండా వెళ్లిపోయారు. ఇంతోలోనే మరోవైపు.. హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు. ఎన్నికల కౌంటింగ్ ఉందని.. తాను ఎన్నికల కౌంటింగ్ సమయంలో పాల్గొనకపోతే.. నష్టపోయే అవకాశం ఉందని ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈక్రమంలోనే హైకోర్టు పిన్నెల్లికి ముందస్తు బెయిల్ ఇచ్చింది. అనంతరం.ఆయన బయటకు వచ్చారు. అయితే.. కొన్ని షరతులకు లోబడి.. ఆయన వ్యవహరించాలని హైకోర్టు పేర్కొంది.
మాచర్లకు వెళ్లరాదని.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని.. మీడియాతోనూ మాట్లాడకూడదని పేర్కొంది. అయితే.. కౌంటింగ్ కేంద్రానికి మాత్రం వెళ్లొచ్చని హైకోర్టు అవకాశం ఇచ్చింది. ఈ ముందస్తు బెయిల్ జూన్ 5వ తేదీ వరకు వర్తిస్తుందని కోర్టు పేర్కొంది. అయితే.. దీనిని.. టీడీపీ నాయకుడు శేషగిరిరావు.. సుప్రీంకోర్టులో సవాల్చేశారు. దీనిని పరిశీలించిన సుప్రీంకోర్టు.. హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదేం తీర్పని.. హైకోర్టు పెద్ద తప్పు చేసిందని వ్యాఖ్యానించింది. జూన్ 6న జరిగే విచారణలో ఖచ్చితంగా దీనిని పరిష్కరించాలని ఆదేశించింది. దీంతో పిన్నెల్లికి కోర్టు కష్టాలు మామూలుగా లేవని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on June 5, 2024 5:34 pm
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…