ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తిరుగులేని విజయం సాధించింది. టీడీపీ-135, జనసేన 21, బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించగా అధికార వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమయింది. ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో ఆ పార్టీల శ్రేణులు సంబరాల్లో మునిగాయి.
ఏపీలో చంద్రబాబు గెలవడంపై ఖమ్మంలో టీడీపీ, జనసేన పార్టీలు సంబురాలు నిర్వహించాయి. ఈ వేడుకలకు అనూహ్యంగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరై ఆయా పార్టీల నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ జిల్లా ఆఫీసులోకి వెళ్లిన మంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకుముందు మంత్రికి తెలుగుదేశం నాయకులు ఘన స్వాగతం పలికారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం టీడీపీ నేతలు బహిరంగంగానే కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతిచ్చారు. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ఇద్దరూ ఖమ్మంలోని టీడీపీ కార్యాలయానికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. గెలిచిన తర్వాత కూడా తెలుగుదేశం నేతలు నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా ఎన్టీఆర్ జయంతి, వర్థంతి వేడుకల్లో పాల్గొనడం విశేషం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మంత్రి టీడీపీ సంబరాలకు హాజరవడా విశేషం.
This post was last modified on June 5, 2024 4:30 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…