Political News

కౌర‌వ స‌భ ముగిసింది.. బాబు శ‌ప‌థం నెర‌వేరింది!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు తాను చేసిన శ‌ప‌థాన్ని నిరూపించుకున్నారు. కౌర‌వ స‌భ‌లో ఉండ‌ను.. గౌర‌వ స‌భ ఏర్పాటైన త‌ర్వాత‌.. సీఎంగానే స‌భ‌లో అడుగు పెడ‌తానంటూ.. 2022లో ఆయ‌న చేసిన శ‌ప‌థం.. అందునా నిండు స‌భ‌లో చేసిన శ‌ప‌థం.. ఇప్పుడు నిజ‌మైంది. క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో.. టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంది. అంతేకాదు… ఏక‌ప‌క్ష విజ‌యం ద‌క్కించుకుంది. పోటీ చేసిన 144 స్థానాల్లోనూ 135 స్థానా ల్లో విజ‌యం సాధించే దిశ‌గా దూసుకుపోయేందుకు టీడీపీ వ‌డివ‌డిగా ముందుకు అడుగులు ప‌డుతు న్నాయి.

ఇదిగ‌మ‌నిస్తే.. టీడీపీ ఏక‌ప‌క్షంగా విజ‌యం ద‌క్కించుకునే అవ‌కాశం మెండుగా క‌నిపిస్తోంది. ఆ నాడు 2022లో వైసీపీలోకి జంప్‌చేసిన గ‌న్న‌వ‌రం అప్ప‌టి ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీ నారా లోకేష్‌, నారా భువ‌నేశ్వ‌రి కేంద్రంగా చేసిన వ్యాఖ్య‌లు అసెంబ్లీ వ‌ర‌కు పాకాయి. దీంతో చంద్ర‌బాబు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారుస‌భ‌లో నిప్పులు చెరిగారు. “ఇది కౌర‌వ స‌భ‌. మ‌ళ్లీ గౌర‌వ స‌భ ఏర్పాట‌య్యే వ‌ర‌కు.. నేను సీఎంగా గెలిచే వ‌ర‌కు స‌భ‌లో అడుగు పెట్ట‌ను” అని శ‌ప‌థం చేసి.. దండం పెట్టి మ‌రీ బ‌య‌ట‌కువ‌చ్చారు.

ఆనాడే టీడీపీ నేత‌లు.. వైసీపీ ప‌తనం ప్రారంభ‌మైంద‌ని.. స‌భ‌లో వ్యాఖ్య‌లు చేశారు. ఇది ఇప్పుడు క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు నిజ‌మైంది. వైసీపీ అధినేత జ‌గ‌న్ ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. లండ‌న్ వెళ్తూ.. ఆశ్చ‌ర్య క‌ర‌మైన పోలింగ్ జ‌రిగింద‌న‌.. దేశం మొత్తం ఏపీవైపు చూసే ప‌రిస్థితి ఉంటుంద‌ని ఆయ‌న చెప్పారు. అచ్చం ఆయ‌న ఏ యాంగిల్‌లో చెప్పారో తెలియ‌దు కానీ.. ఇప్పుడు దేశం మొత్తం ఏపీవైపు చూసేలా ప్ర‌జా తీర్పు ఏక‌ప‌క్షంగా సాగిపోయింది. మ‌హిళ‌లు రాత్రి 9 గంట‌ల వ‌రకు క్యూలైన్ల‌లో వేచి ఉండిమ‌రీ ఓటేశారు. ప‌లితంగా కౌర‌వ స‌భ పోయి.. గౌర‌వ స‌భ ఏర్ప‌డి.. చంద్ర‌బాబు త‌న శ‌ప‌థాన్ని నిరూపించుకున్నారు.

This post was last modified on June 4, 2024 1:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వివేకా కేసులో స్పీడు పెంచిన సునీత

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…

2 hours ago

గౌతంరెడ్డికి ఈ సారి మూడిన‌ట్టేనా?

పూనూరు గౌతం రెడ్డి. విజ‌యవాడ‌కు చెందిన వైసీపీ నాయ‌కుడు. అయితే.. గ‌తంలో ఆయ‌న వంగ‌వీటి మోహ‌న్‌రంగాపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో…

5 hours ago

‘కంగువ’ శబ్ద కాలుష్యం.. టెక్నీషియన్ ఆవేదన

సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…

6 hours ago

కూట‌మి నేత‌లు కూడా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాలి: చంద్ర‌బాబు వార్నింగ్‌

అసెంబ్లీ వేదిక‌గా కూట‌మి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏల‌కు, పార్టీల కార్య‌కర్త‌ల‌కు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…

6 hours ago

బాబు మ్యాజిక్ మ‌హారాష్ట్ర లో పని చేస్తదా?

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు నేటి నుంచి మ‌హారాష్ట్ర‌లో రెండు పాటు ప‌ర్య‌టించ‌నున్నారు. ఆయ‌నతోపాటు డిప్యూటీ సీఎం ప‌వ‌న్…

7 hours ago