Political News

టీడీపీ చ‌రిత్ర‌లో క‌నీవినీ ఎరుగ‌ని విజ‌యం!

2024 ఎన్నిక‌ల్లో గెలుస్తామా? గెల‌వ‌లేమా? అన్న స్థాయి నుంచి క‌నీవినీ ఎరుగ‌ని విజ‌యం దిశ‌గా టీడీపీ దూసుకుపోతోంది. గ‌త 2014, 2019 ఎన్నిక‌ల‌తోపోల్చుకుంటే.. 2024 ఎన్నిక‌లు టీడీపీకి ఒక కొత్త చ‌రిత్ర‌ను అందించాయి. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ కేవ‌లం 102 స్థానాల‌కే ప‌రిమితం అయింది. ఇవి ఒంట‌రిగా తెచ్చుకున్న సీట్లు. ఇక‌, 2019 ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి ఒంటరిగానే పోటీలో నిలిచింది. ఫ‌లితంగా 23 స్థానాల‌కే ప‌రిమితం అయింది. వీరిలోనూ న‌లుగురు జంప్ అయిపోయారు.

దీంతో వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. ఆ పార్టీ వ‌చ్చిన నాటి నుంచి టీడీపీ అనేక ఇబ్బందులు ప‌డింద‌నే విష‌యంలో సందేహం లేదు. ఒకానొక సంద‌ర్భంలో ప్రధాన ప్ర‌తిప‌క్షం కూడా.. ద‌క్కే ప‌రిస్థితి లేకుండా పోయింద‌నే వాద‌న వినిపించింది. ఇక‌, కేసుల న‌మోదు.. నాయ‌కుల‌ను అరెస్టు చేయ‌డం జైళ్ల‌లో పెట్ట‌డం తో న్యాయ పోరాటాలు నిత్యంకృత్యం అయ్యాయి. మ‌రీముఖ్యంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబును కూడా జైల్లో పెట్ట‌డం వంటివి పార్టీని ఇబ్బందుల్లో కి నెట్టాయి.

దీంతో అస‌లు పార్టీ ఉంటుందా? ఉండ‌దా? అనే చ‌ర్చ కూడా తెర‌మీదికి వ‌చ్చింది. కానీ, ప్ర‌స్తుతం వ‌స్తున్న ట్రెండ్‌లో మాత్రం టీడీపీ ఒంట‌రిగానే మేజిక్ ఫిగ‌ర్ దాటిపోయింది. ప్ర‌స్తుతం పొత్తు పెట్టుకున్న టీడీపీ 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో 144 స్థానాల్లో మాత్ర‌మే పోటీ చేసింది. అయితే.. 129 స్థానాల్లో టీడీపీ ఒంట‌రిగానే విజ‌యం ద‌క్కించుకునేలా ముందుకు సాగుతోంది.

ఇప్ప‌టికే 100 స్థానాల్లో దాదాపు టీడీపీ ఒంట‌రి విజ‌యం ఖాయ‌మైంది. దీంతో మొత్తం 129 స్థానాల్లోటీడీపీ క‌నుక విజ‌యం ద‌క్కించుకుంటే.. ఇది క‌నీ వినీ ఎరుగ‌ని విజ‌యంగానే భావించాలి.అంతేకాదు.. చంద్ర‌బాబు పార్టీ అధినేత అయిన త‌ర్వాత‌.. ద‌క్కిన అద్భుత విజ‌యంగానే దీనిని భావించాలి.

This post was last modified on June 4, 2024 12:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago