ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం ధర్మవరం. ఇక్కడ రాజకీయంగా కొత్త రగడ తెరమీదికి వచ్చింది. తాజాగాజరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేయాలని భావించిన పరిటాల వారసుడు శ్రీరాంకు టికెట్ దక్కలేదు. ఇదే సమయంలో ఆయన వ్యతిరేకించిన గోనుగుండ్ల సూర్య నారాయణ, ఉరఫ్ వరదా పురం సూరికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఎటొచ్చీ.. కూటమిలో భాగంగా బీజేపీకి ఈటికెట్ ఇచ్చారు.
బీజేపీ నుంచి బలమైన నాయకుడు, యాదవ సామాజిక వర్గానికి చెందిన సత్యకుమార్ పోటీచేశారు. ఈయనకు టీడీపీ నాయకులు కూడా సహకరించారు. ముఖ్యంగా పరిటాల శ్రీరాం అన్నీ తానై.. ఇక్కడ ప్రచారం చేశారు. యువతను కూడా సమీకరించారు. వైసీపీని ఓడించాలని గట్టిగానే శ్రీరాం ప్రయత్నించారు. అంతా బాగానే జరిగిపోయిందని అనుకున్నారు. కానీ, ఎన్నికల పోలింగ్ రోజు.. దీనికి ముందు రోజు రాత్రి జరిగిన వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది.
వైసీపీ అభ్యర్థి వ్యూహాత్మకంగా వ్యవహరించి.. టీడీపీ యువతను తనవైపు తిప్పుకొన్నారనే ప్రచారం తెరమీదికి వచ్చింది. వారిని నయానో.. భయానో.. తమవైపు తిప్పుకోవడంతో టీడీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగి.. వైసీపీకి మేలు జరిగిందనే లెక్కలు తెరమీదికి వస్తున్నాయి. ఇది సత్యకుమార్‌ను డోలాయమానంలో పడేసింది. ఇదంతా కావాలని చేశారంటూ.. సత్యకుమార్ వర్గం ఆందోళనకు దిగడంతో విషయం వెలుగు చూసింది.
అయితే.. శ్రీరాం వర్గం మాత్రం తాము నిఖార్సుగానే పనిచేశామని.. ఎక్కడా పొరపాట్లు జరగలేదని చెబు తుండడం గమనార్హం. కానీ, క్షేత్రస్తాయిలో మాత్రం వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ పరి ణామాలతో ధర్మవరంలో క్రాస్ ఓటింగ్‌పై సందేహాలు తలెత్తుతున్నాయి. అదీగాక.. మరో సందేహం కూడా తెరమీదికి వస్తోంది. వరదాపురం సూరి ఉద్దేశ పూర్వకంగా సత్యకుమార్‌కు చెక్ పెట్టేలా వ్యవహరించి.. ఈ పనిచేశారనే చర్చ కూడా జరుగుతోంది.
This post was last modified on May 30, 2024 6:53 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు. మంత్రి నారా లోకేశ్ లను కేవలం గంట వ్యవధిలోనే…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన ఆవిర్భవించి ఈ నెల 14కు 11 ఏళ్లు పూర్తి కానుంది.…
మన దగ్గర స్టార్ వారసులను పరిచయం చేసే విషయంలో తండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అభిమానుల అంచనాలు ఆశలు, మార్కెట్…
వాణిజ్య ప్రకటనల్లో స్టార్ హీరోలు నటించడం కొత్తేమీ కాదు. మహేష్ బాబు ఎన్ని బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నాడో అభిమానులే ఠక్కున…
2025 కొత్త సంవత్సరంలో దాదాపు రెండున్నర నెలలు గడిచిపోయాయి. బాక్సాఫీస్ పరంగా ఫలితాలు విశ్లేషించుకుంటే జనవరి నుంచి మార్చి దాకా…
సినీ రంగంలో ఉన్న వాళ్లు అక్కడ డబ్బులు సంపాదించి.. వేరే రంగాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. చాలామంది రియల్ ఎస్టేట్ వైపు…