ఏపీ అధికార పార్టీ వైసీపీ ప్రస్తుత ఎన్నికల్లో ఈక్వేషన్ల మంత్రం పఠించింది. స్థానికంగా ఉన్న వారిని.. సిట్టింగులను కూడా ఎన్నికల సమయంలో మార్పు చేసింది. నియోజకవర్గంతో సంబంధం లేని వారిని కూడా.. ఇక్కడ నియమిస్తూ.. తాము ప్రయోగాలు చేస్తున్నట్టు చెప్పుకొంది. అయితే.. అన్ని వేళలా ఈ ప్రయోగాలు ఫలిస్తాయని చెప్పలేని పరిస్థితి. ఇదే.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా నాలుగు కీలక నియోజకవర్గాలను పార్టీ వదులుకునే పరిస్థితి వచ్చిందని అంటున్నారు.
పెనమలూరు… ఇక్కడ బీసీ నేత, మంత్రి జోగి రమేష్‌కు అవకాశం ఇచ్చారు. కానీ, ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండడంతోపాటు.. టీడీపీకి బలమైన కేడర్ ఉంది. దీంతో ఈ సీటు ను దక్కించుకోవడం వైసీపీకి అంత ఈజీకాదని అంటున్నారు. పైగా.. ఇక్కడ పోలింగ్ శాతం 79.12 గా నమోదైంది. ఇది స్థిరమైన ఓటు బ్యాంకు కావడం.. టీడీపీకే అనుకూలంగా పడిందనే చర్చ సాగుతోంది. దీంతో ఇక్కడ టీడీపీనే గెలుపు గుర్రం ఎక్కుతుందని అంటున్నారు.
మైలవరం: ఇక్కడ కూడా.. టీడీపీకి అనుకూల పవనాలు వున్నాయి. వైసీపీ చేసిన బీసీ ప్రయోగం ఇక్కడ కూడా వికటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక సాధారణ నాయకుడిని ఎమ్మెల్యే చేయాలని అనుకున్నా.. ఇక్కడ వైసీపీ వేసిన అడుగులు.. నియోజకవర్గంలో కాక రేపుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టడంతో ఆ సెగ బాగా పనిచేసింది.
ఇక, చిలకలూరిపేటలోనూ.. ఇదే తరహా ప్రయోగం చేసింది వైసీపీ. సిట్టింగ్ ఎమ్మెల్యే కమ్ మంత్రిని వేరే చోటకు మార్చిన వైసీపీ.. గుంటూరు నగరానికి చెందిన మేయర్ ను తీసుకువచ్చి.. కావటి మనోహర్‌ను ఇక్కడ నిలిపింది. ఇది ఈ నియోజకవర్గంలో వైసీపీ నేతలకే నచ్చలేదు. దీంతో చివరి నిముషంలో వారు లోపాయికారీగా టీడీపీకి అనుకూలంగా పనిచేశారు. దీంతో ఇక్కడ కూడా.. టీడీపీ గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంది.
అదే విధంగా… వైసీపీ చేసిన మరో ప్రయోగం..తాడికొండ. ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ ప్రత్తిపాడు నుంచి తెచ్చిన మేకతోటి సుచరితకు జగన్ టికెట్ ఇచ్చారు. కానీ.. ఇది టీడీపీకి అనుకూలంగా మారింది. దీంతో ఇక్కడ కూడా.. పార్టీ ఓటమి పాలయ్యే ఛాన్స్ మెండుగా ఉందనే చర్చ సాగుతోంది. ఓటింగ్ కూడా ఏకపక్షంగానే సాగిందని అంటున్నారు.
This post was last modified on May 29, 2024 11:47 am
నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ…
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…
మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…