సాంకేతిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఏఐ పాత్ర పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో తమకు తెలిసిన, తెలియని అనేక ప్రశ్నలను నెటిజన్లు ఏఐని అడుగుతున్నారు. వీటి జెమినీ ఏఐ, మాయ ఏఐ అనేవి సమాధానాలు చెబుతున్నాయి. ఒక్కొక్కసారి వివాదం కూడా అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ విషయం వెలుగు చూసింది. ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ విజయం దక్కించుకుంటుంది? ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే ప్రశ్నలు.. తాజాగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏ ఇద్దరు కలిసినా.. ఈ విషయంపైనే చర్చించుకుంటున్నారు.
ఇక, మెలితిరిగిన అనుభవం ఉన్న సెఫాలజిష్టులు కూడా.. దీనికి సమాధానం చెప్పలేక.. వేచి చూడండి అంటూ తప్పించుకుం టున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఔత్సాహిక నెటిజన్లు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. చాట్ జీపీటీలైన మాయ ఏఐ
ని ఆశ్రయించారు. ఏపీలో ఏ పార్టీ విజయం దక్కించుకుంటుంది? ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? వంటి కీలక ప్రశ్నలు సంధించారు. ఇదే సమయంలో టచ్ చేసి చూడు తరహాలో.. టీడీపీ అధినేత ఎవరు? ఏపీ ప్రస్తుత సీఎం ఎవరు? అనే ప్రశ్నలు కూడా.. సంధించారు. ఈ రెండు ప్రశ్నలకు మాయ ఏఐ.. సరైన సమాధానాలే చెప్పింది.
టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు అని చెప్పింది. అదేవిధంగా ప్రజెంట్ సీఎం ఆఫ్ ఏపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని బదులిచ్చింది. ఇక, ఏపీలో ఎలా ఎన్నికలు జరిగాయి.. అంటే.. రాడికల్‌గా జరిగాయని.. చెప్పడం విశేషం. అదేసమయంలో ఎక్కడెక్కడ హింస జరిగిందన్న ప్రశ్నకు కూడా సమాధానం సరిగానే చెప్పింది. తాడిపత్రి, పల్నాడు అని పేర్కొంది. ఇక, ఎవరు గెలుస్తారు? అనే ప్రశ్నకు మాత్రం మాయ ఏఐ కూడా దాటవేసింది. ‘దీనికి సమాధానం నాకు తెలీదు. తెలిశాక చెబుతాఅని చెప్పడం గమనార్హం. ఇక, ఎవరు ముఖ్యమంత్రి అవుతున్నారన్న ప్రశ్నకు..
ప్రస్తుత సీఎం జగన్ మోహన్‌రెడ్డి’ అని పదే పదే బదులివ్వడం గమనార్హం. దీంతో ఏఐ కూడా అంచనా వేయలేక పోతోందంటూ.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
This post was last modified on May 27, 2024 9:48 pm
ఏపీ రాజధాని అమరావతికి స్టార్ ఇమేజ్ రానుందా? ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన స్టార్ హోటళ్ల దిగ్గజ సంస్థలు.. అమరావతిలో…
అలేఖ్య చిట్టి పికిల్స్.. సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి దీని గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. రాజమండ్రికి చెందిన…
కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు.. వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. తాజాగా ఆమె మీడియాతో…
సన్‌రైజర్స్ హైదరాబాద్.. గత ఏడాది ఐపీఎల్‌ను ఒక ఊపు ఊపేసిన జట్టు. అప్పటిదాకా ఈ లీగ్‌లో ఎన్నో బ్యాటింగ్ విధ్వంసాలు…
సమాజంలోని ఏ కుటుంబమైనా.. తమకు ఓ గూడు కావాలని తపిస్తుంది. అయితే.. అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. పేదలు,.. అత్యంత…
అసలు బాలీవుడ్ లోనే కనిపించడం మానేసిన సీనియర్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా హఠాత్తుగా టాలీవుడ్ క్రేజీ అవకాశాలు పట్టేస్తుండటం ఆశ్చర్యం…