భారతీయ సినిమాలో కొన్నేళ్లుగా బయోపిక్‌ల హవా నడుస్తోంది. ఐతే ఎక్కువగా స్పోర్ట్స్ బయోపిక్స్‌యే తెరకెక్కుతున్నాయి. అవే విజయవంతం అవుతున్నాయి. పొలిటికల్ మైలేజీ కోసం రాజకీయ నేతల బయోపిక్స్ కూడా తెరకెక్కతున్నాయి కానీ.. వాటిలో విజయవంతమవుతున్నవి అరుదే. తెలుగులో ఎన్టీఆర్, వైఎస్సార్‌ల మీద సినిమాలు తీశారు. వీటిలో దేనికీ బాక్సాఫీస్ సక్సెస్ దక్కలేదు.
‘యాత్ర’ దాని స్థాయిలో ఓ మోస్తరుగా అయినా ఆడింది కానీ.. ‘యన్.టి.ఆర్’ సినిమా అంచనాల్ని అందుకోలేక చతికిలపడింది. మరాఠీలో బాల్ థాకరే మీద సినిమా తీస్తే అది కూడా పెద్దగా జనాల్ని మెప్పించలేకపోయింది. ఇక ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ మీద అపారమైన అభిమానంతో గత ఏడాది ఎన్నికలకు ముందు ‘పీఎం నరేంద్ర మోడీ’ పేరుతో ఓ సినిమా తీశారు బాలీవుడ్ జనాలు.
వివేక్ ఒబెరాయ్ లాంటి ప్రముఖ నటుడు ఇందులో లీడ్ రోల్ చేశాడు. ఐతే ఆద్యంతం మోడీ భజన చేస్తూ, ఆయనేదో లోక కళ్యాణం కోసమే పుట్టినట్లు చూపించిన ఈ సినిమాను ప్రేక్షకులు అసలు పట్టించుకోలేదు. ఈ సినిమాతో వాళ్లు మోడీని మెప్పించి ఆయన ప్రాపకం ఏమైనా సంపాదించారేమో తెలియదు. ఐతే మోడీపై ఒక సినిమా తిరస్కరణకు గురయ్యాక మళ్లీ ఇప్పుడు ఇంకో సినిమా రెడీ అవుతుండటం విశేషం.
ఆ సినిమా పేరు.. మనో వైరాగి. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్.. బాలీవుడ్ ఫేమస్ డైరక్టర్ కమ్ ప్రొడ్యూసర్ సంజయ్ లీలా బన్సాలీతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తుండటం గమనార్హం. గురువారం మోడీ పుట్టిన రోజు సందర్భంగా దీని ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. ఇందులో అభయ వర్మ అనే కొత్త నటుడు యువకుడైన మోడీ పాత్రలో కనిపంచనున్నాడు. సంజయ్ త్రిపాఠి దర్శకుడు. మరి ఈ సారైనా మోడీ సినిమా ఎగ్జాజరేషన్లు లేకుండా ఆకట్టుకునేలా తెరకెక్కుతుందేమో.. జనాలు పట్టించుకుంటారేమో చూడాలి.
This post was last modified on September 25, 2020 12:00 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…