ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై చీటింగ్ కేసు నమోదయ్యింది. ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తానని చెప్పి తన వద్ద రూ.50 లక్షలు తీసుకున్నారని రంగారెడ్డి జిల్లాలోని జిల్లెలగూడకు చెందిన యస్ కిరణ్ ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం టిక్కెట్ ఇస్తానని డబ్బులు తీసుకున్నాడని, ఆయనకు రూ.30 లక్షలు ఆన్ లైన్ ద్వారా, మిగిలిన రూ.20 లక్షలు పలు దఫాలుగా నగదు రూపంలో ఇచ్చానని కిరణ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాఫ్తు చేస్తున్నారు.
తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసిన కేఏ పాల్ అనంతరం ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాడు. తనను గెలిపిస్తే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుతానని ప్రచారం చేశాడు.
This post was last modified on May 17, 2024 8:00 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…