Political News

అరవింద్ కేజ్రివాల్ కు బిగ్ రిలీఫ్ !

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు పెద్ద ఊరట లభించింది.. ఢిల్లీ హైకోర్టు తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలంటూ కోర్టులో దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించింది. కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి వైదొలగాలని అడిగే హక్కు లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే జూన్‌ 5న తిహార్‌ జైలు నుంచి తిరిగి విడుదలవుతానని అరవింద్‌ కేజ్రీవాల్‌ నిన్న వ్యాఖ్యానించిన నేపథ్యంలో కోర్టు తాజా నిర్ణయంతో ఆయన ఊపిరి పీల్చుకున్నట్లేనని భావిస్తున్నారు. మద్యం పాలసీ కేసులో అరెస్టయిన అరవింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. మళ్లీ జూన్ 2న లొంగిపోవాలని సూచించింది.

ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ‘తిహార్‌లోని తన సెల్‌లో రెండు సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ఫీడ్‌ను 13 మంది అధికారులు పర్యవేక్షించారు. సీసీటీవీ ఫీడ్‌ను పీఎంవోకు సైతం అందించారు. మోదీ సైతం దానిని పర్యవేక్షిస్తున్నారు. మోదీకి తనపై ఎలాంటి పగ ఉందో నాకు తెలియదు. బూత్‌ర్రూమ్‌కి వెళ్లడానికి నేను రాత్రి ఏ సమయానికి లేస్తానో కూడా వారు పర్యవేక్షించే వారు’ అన్నారు. కేజ్రీవాల్‌ డిప్రెషన్‌లో లేరని.. తనకు హనుమంతుడి ఆశీస్సులు ఉన్నాయని వారికి చెప్పాలనుకుంటున్నానన్నారు. తాను జూన్‌ 2న తిహార్‌ జైలుకు వెళ్లినప్పటికీ.. జూన్‌ 4న జైలులోనే ఫలితాలను చూస్తానన్నారు. ఇండియా కూటమి గెలిస్తేనే జూన్‌ 5న మళ్లీ బయటకు వస్తానని, ఈ ఎన్నికలలో కష్టపడకపోతే నేను మళ్లీ ఎప్పుడు కలుస్తామో తెలియదని వ్యాఖ్యానించడం విశేషం.

This post was last modified on May 14, 2024 11:07 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

భీమ్స్….ఇలాగే సానబడితే దూసుకెళ్లొచ్చు !

టాలీవుడ్ లో సంగీత దర్శకుల కొరత గురించి చెప్పనక్కర్లేదు. తమన్, దేవిశ్రీ ప్రసాద్ ని అందరూ తీసుకోలేరు. పైగా వాళ్ళు…

3 hours ago

రిటైర్ అయ్యాక భారత్ కు కోహ్లీ వీడ్కోలు?

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఆటతో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.…

9 hours ago

ఆ కేసుపై రేవంత్ కు కేటీఆర్ సవాల్

2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో స్కామ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న…

10 hours ago

ఆచితూచి మాట్లాడండి..మంత్రులకు చంద్రబాబు సూచన

ఈ టెక్ జమానాలో ఆడియో, వీడియో ఎడిటింగ్ లు పీక్ స్టేజికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక, ఏఐ, డీప్…

11 hours ago