ఏపీలో మాఫియాలు చెలరేగిపోతున్నాయని.. ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ ఘటనలో 30 గ్రామాలు కొట్టుకుపోయి.. 12 మంది మరణించారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు చెప్పారు. ఇలాంటి మాపియాలకు ఇక్కడి ప్రభుత్వంమద్దతు ఇస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాఫియాగాళ్లకు కౌంట్ డౌన్ మొదలైందని ప్రధాని చెప్పారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. వీరికి సరైన ట్రీట్‌మెంట్ ఇస్తామన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన రాయలసీమ సమస్యలపై ప్రధానంగా ఫోకస్ చేశారు. ఇక్కడి రైతులకు గిట్టుబాట ధరలు లభించడం లేదని.. కోల్డు స్టోరేజీలు లేకపోవడంతో టమాటా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల విషయాన్ని కూడా మోడీ ప్రస్తావించారు. పులివెందులలో అరటి పంటల ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అయితే.. ఇవన్నీ కూడా ఎన్డీయే కూటమి ప్రభుత్వంతోనే సాకారం అవుతాయన్నారు. పోలవరం సహా.. అనేక ప్రాజెక్టులను ఇక్కడి ప్రభుత్వం అడ్డుకుందని చెప్పారు.
ఇదేసమయంలో సీమ నుంచి ముఖ్యమంత్రులు చాలా మంది వచ్చారని..కానీ, ఈ ప్రాంతం ఇంకా కరువు పీడిత ప్రాంతంగా ఎందుకు ఉండిపోయిందో ఇక్కడి వారు ఆలోచించాలని మోడీ చెప్పడం గమనార్హం. ఇక్కడ నుంచి వలసలు పెరిగాయని.. అయినా ఏ ముఖ్యమంత్రీ చర్యలు తీసుకున్న పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాగానే సాగునీటి ప్రాజెక్టులను నిర్మించనున్నట్టు తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కారు వస్తే.. రాష్ట్రం అభివృద్ది బాటలో దూసుకుపోతుందన్నారు. పలు రైలు ప్రాజెక్టులకు కూడా శ్రీకారం చుట్టనున్నట్టు చెప్పారు. ఆయా వివరాలు వెల్లడించారు.
వైసీపీ విశ్వాసఘాతుకం!
గత ఎన్నికల్లో ప్రజలు అనేక ఆకాంక్షలతో వైసీపీ ప్రభుత్వాన్ని ఇక్కడి ప్రజలు ఏర్పాటు చేసుకున్నారని మోడీ అన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం ప్రజల విశ్వాసాలను నిండా ముంచిందని.. విశ్వాస ఘాతుకానికి పాల్పడిందని అన్నారు. పేదలను వారి మానాన వారిని వదిలేసిందని అన్నారు. కేవలం మాఫియాను మాత్రమే వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని నిప్పులు చెరిగారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. మాఫియాకు తగిన ట్రీట్ మెంట్ చేస్తామన్నారు.
This post was last modified on May 8, 2024 6:59 pm
నందమూరి బాలకృష్ణ హిట్ మూవీ ‘భగవంత్ కేసరి’ని తమిళ టాప్ స్టార్ విజయ్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్…
ప్రస్తుతం స్విట్జర్లాండ్ లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ పెట్టుబడుల సదస్సులో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్…
పుష్ప-2 విడుదలకు ముందు ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయమై ఎంత గొడవ నడిచిందో తెలిసిందే. సుకుమార్ కెరీర్ ఆరంభం…
డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ తో వరుసగా రెండు బ్లాక్ బస్టర్స్ సాధించిన సిద్దు జొన్నలగడ్డ కొంచెం గ్యాప్ తీసుకున్నట్టు…
‘ఖైదీ నంబర్ 150’తో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత తన స్థాయికి సినిమాలు చేయలేదనే అసంతృప్తి…
మంచు విష్ణు స్వీయ నిర్మాణంలో హీరోగా రూపొందుతున్న కన్నప్పలో ప్రభాస్ లుక్ ఎప్పుడెప్పుడు వస్తుందాని ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు.…