Political News

ద‌క్షిణాది వాళ్లు ఆఫ్రిక‌న్ల‌లా ఉంటారు: పిట్రోడా

భావం మంచిదే అయినా.. మాట తీరు కూడా.. అంతే మంచిగా ఉండాలి. మాట‌లో ఏ చిన్న తేడా వ‌చ్చినా.. భావం మొత్తాన్ని హ‌రించేస్తుంది. వివాదం కూడా చేస్తుంది. “మీ నాన్న ఉన్నాడా? – అన్న‌దానికీ.. నీ అమ్మ మొగుడు ఉన్నాడా? ” అన్న దానికీ ఎంత తేడా ఉంది. ఇలానే.. భావం మంచిదే అయినా మాట తీరు స‌రిగా లేక‌పోతే.. తీవ్ర ప్ర‌మాదమే వ‌స్తుంది. ఇప్పుడు.. కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు. ఒక‌ప్ప‌టి స‌ల‌హాదా రు.. శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి.

ఇటీవ‌ల కూడా ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అమెరికాలో వార‌స‌త్వ ఆస్తికి ప‌న్నులు వేస్తార‌ని.. ప్ర‌భుత్వ‌మే తీసుకుంటుంద‌ని అన్నారు. స‌రిగ్గా అప్పుడే మోడీ దేశంలో జ‌నాల సంప‌ద లాగేసుకునేందుకు కాంగ్రెస్ ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆరోపిస్తున్నారు. ప్ర‌చారం కూడా చేస్తున్నారు. దీని నుంచి ఎలా బ‌య‌ట ప‌డాలా? అని కాంగ్రెస్ త‌ల‌ప‌ట్టుకుని కూర్చున్న స‌మ‌యంలో పిట్రోడా చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత శాపంగా మారాయి.

ఇక‌, ఇప్పుడు పిట్రోడా మ‌రో బాంబు పేల్చారు అయితే.. ఆయ‌న ఉద్దేశ పూర్వ‌కంగా అన‌క‌పోయినా.. కాంగ్రెస్‌కు మ‌రింత ఇబ్బందిగా అయితే మారాయి. తాజాగా ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో .. దేశ ఐక్య‌త‌.. భిన్న‌త్వంలో ఏక‌త్వం వంటివాటిని ఆయ‌న వివ‌రించారు. భిన్న‌మైన మ‌తాలు.. భిన్న‌మైన తెగ‌లు ఉన్నా.. ఐక్యంగా ఉంటార‌ని.. సెక్యులర్దే శ‌మ‌ని మంచి ఉద్దేశంతోనే చెప్పుకొచ్చారు. ఈ సంద‌ర్భంగానే ఆయ‌న ద‌క్షిణాది, ఉత్త‌రాది, ఈశాన్య ప్రాంతాల ప్ర‌జ‌ల పోలిక చెప్పారు.

ఇది అంద‌రూ పోలుస్తారు. కానీ, పిట్రోడా మాత్రం చెండాల‌మైన పోలిక చేశారు. ఈశాన్య రాష్ట్రాల ప్ర‌జ‌లు చైనీయుల్లా ఉంటార‌ని.. పశ్చిమ రాష్ట్రాల్లో ఉండేవారు అరబ్బుల్లా ఉంటార‌ని అన్నారు. ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఉండేవారు.. ఆఫ్రిక‌న్‌ల మాదిరిగా(న‌ల్ల‌గా) ఉంటార‌ని చెప్పారు. ఇక‌, ఉత్త‌రాది వారు బ్రిటీష్ వారిలా క‌నిపిస్తార‌ని తెలిపారు. మొత్తంగా ఎవ‌రు ఎలా ఉన్నా.. అంద‌రూ ఐక్యంగా ఉండి.. దేశ ప్ర‌జాస్వామ్యాన్ని ప‌రిర‌క్షిస్తున్నార‌నేది పిట్రోడా భావం.

కానీ.. పోలికలో తేడా కొట్ట‌డం.. పైగా.. ఎన్నిక‌ల సీజ‌న్ కావ‌డంతో బీజేపీ విరుచుకుప‌డుతోంది. కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ.. మ‌ణిపూర్‌, అస్సాం ముఖ్య‌మంత్రులు స‌హా కీలక నాయ‌కులు కూడా.. పిట్రోడాపై విరుచుకుప‌డ్డారు. దేశ ఐక్య‌త గురించి ఇలాంటి పోలిక‌లేంట‌ని.. తాము ఎప్పుడూ ఇలా పోల్చుకోలేద‌ని అన్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి మ‌రో స‌మ‌స్య వ‌చ్చిన‌ట్టు అయింది.

This post was last modified on May 8, 2024 6:41 pm

Share

Recent Posts

సేనాపతి మీద అభిమానుల భారం

ఒక అల్ట్రా డిజాస్టర్ కు సీక్వెల్ రావడం చాలా అరుదు. ఆ విషయంలో భారతీయుడు 3 కొత్త రికార్డుని సొంతం…

42 minutes ago

అది ప్యారడైజ్ కాకి కాదు

ఈ సోషల్ మీడియా కాలంలో సినిమాల్లో ఎవరిని ఉద్దేశించి ఏ పంచ్ వేసినా.. అది కాంట్రవర్శీగా మారడానికి ఎంతో సమయం…

1 hour ago

యష్ బయటికి వచ్చే టైమయ్యింది

ఎంత పెద్ద స్టార్ హీరోకైనా డిజాస్టర్లు సహజం. ఎన్టీఆర్ ఎంజిఆర్ నుంచి చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ దాకా అందరికీ అనుభవమే.…

2 hours ago

నేరుగా సుప్రీం వద్దకు ఎలా వస్తారు?

రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారిన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దంపతులకు…

2 hours ago

జిమ్ జిమ్ తార అంటూ మెడికోల నిరసన

ఈ సోషల్ మీడియా జమానాలో ఏ పాట ఎప్పుడు ఎక్కడ ఎలా వైరల్ అవుతుందో ఎవ్వరికీ తెలీదు. ఆ కుర్చీని…

3 hours ago

వంగా, జక్కన్న ఫెయిల్… నీల్ అయినా నిలబెడతాడా!

స్టార్ డైరెక్టర్ సినిమాను డైరెక్ట్ చేయకపోయినా.. కనీసం సమర్పకుడిగా ఆయన పేరు పోస్టర్ మీద పడితే చాలు, ఆ ప్రాజెక్టుకు…

4 hours ago