ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ ఇటీవల పెట్టిన వీడియో ఎంత వైరల్ అయిందో తెలిసిందే. అంబటి అంతటి నీచ నికృష్టుడిని తాను ఇంత వరకు చూడలేదంటూ ఘాటు వ్యాఖ్యలే చేశారు గౌతమ్. అంబటికి ఓటేస్తే జరిగే నష్టం గురించి జనాలకు వివరిస్తూ హెచ్చరిక జారీ చేశారు.
దీనికి అంబటి కూడా దీటుగానే స్పందించారు. ఒక ప్రెస్ మీట్ పెట్టి తన అల్లుడికి కూతురు నాలుగేళ్లుగా దూరంగా ఉందని.. అప్పట్నుంచి వారి ఇద్దరు పిల్లల పోషణ తనే చూసుకుంటానని చెప్పారు. అంతే కాక పవన్ కళ్యాణ్ వెనుక ఉండి గౌతమ్‌తో ఇదంతా చేయిస్తున్నాడని ఆరోపించారు.
దీంతో గౌతమ్ మళ్లీ ఒక ఎమోషనల్ వీడియోను షేర్ చేశాడు. తనను తన పిల్లలకు దూరం చేయడమే కాక.. తన తండ్రి ఆఖరి కోరిక తీర్చనివ్వకుండా అంబటి కుటుంబం తనను ఎంత క్షోభ పెట్టింది గౌతమ్ ఈ వీడియోలో వివరించారు.
తన తండ్రి ఆసుపత్రిలో చివరి క్షణాల్లో ఉండగా ఒక్కసారి తన మనవడు, మనవరాలిని చూపించాలంటూ అంబటిని వేడుకుంటూ ఒక వీడియో పంపినా కూడా అంబటి కుటుంబం కరుణించి పిల్లల్ని పంపలేదని ఆయన వీడియోను ప్రదర్శిస్తూ ఆవేదన చెందారు. ఇంకా ఈ వీడియోలో గౌతమ్ ఏమన్నారంటే..
“లాస్ట్ టైం నేను పెట్టిన వీడియో వైరల్ అవడంతో అందరూ చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. తర్వాత అంబటి రాంబాబు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ చాలా బాగా చెప్పారు. కొన్ని విషయాలు చూసి మా మావయ్య ఇంత మంచి వారా అని నేను కూడా నమ్మేశాను.
దాంతో నాలుగు సంవత్సరాల నుంచి తన మనవడు, మనవరాలు ఆయన దగ్గరే ఉంటున్నారని.. వాళ్లను ఆర్థికంగా తనే చూసుకుంటున్నారని.. అల్లుడైన తాను ఎలాంటి సాయం చేయడం లేదని.. దుర్మార్గుడు అయితే గియితే తానే అవుతానని మంచి వాగ్ధాటితో చెప్పారు.
ఇలా మాట్లాడ్డంలో ఆయన స్కిల్‌ను ఒప్పుకోవాలి. నా వెనుకాల మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడుగారు ఉండి ఇదంతా చేయిస్తున్నారని అన్నారు. 2023 మార్చి 3న మా నాన్న అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉండగా ఒక వీడియోను రాంబాబు గారికి పంపాను. తన మనవడు, మనవరాలిని చూడాలని ఉందని ఇలా ఎన్నో వీడియోలు, మెసేజ్‌లు రాంబాబు గారికి పంపాం.
నా తండ్రి ఆఖరి క్షణాల్లో ఉన్నారని చెప్పినా వాళ్ల మనసు కరగలేదు. మార్చి 22న ఆయన మరణించారు. ఆయన గుండెల మీద ఎత్తుకుని పెంచిన మనవడిని మనవరాలిని చూసుకోలేదని ఎంత కుంగిపోయి ఉంటారో మీ ఊహకి తెలుసా? ఇదేనా మీ మంచితనం? దీని గురించేనా మీరు మాట్లాడుతోంది? మీ ఫ్యామిలీని ప్రశ్నిస్తే ఎంత దుర్మార్గమైనా చేస్తారా? ఒక తండ్రి ఆఖరి కోరిక నెరవేర్చలేని కొడుకుగా నాకెవరు బదులిస్తారు? మీరు పెట్టిన ఇబ్బందులు తట్టుకోలేక చివరికి విసుగెత్తి కోర్టుకు వెళ్లాను. ఎన్నిసార్లు ప్రాధేయపడినా నా దగ్గరికి నా కొడుకు కూతురిని పంపించలేదు. వాళ్లను మీరు పోషించాల్సిన పని లేదు. నేను ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగున్నాను. ఇప్పుడే మీడియా ముందు ఇంటికి వస్తాను. నా పిల్లల్ని నాతో పంపిస్తారా? పోనీ మీరే వాళ్లను నా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. నేనేమైనా వద్దన్నానా? మీరు రూపాయి పెట్టాల్సిన పని లేదు. బంగారం లాగా గుండెల మీద ఎత్తుకుని పెంచుతా. నాలుగేళ్లుగా నన్ను వాళ్లకు దూరం చేసేసి.. మనిషిలోని ప్రాణం తీసేసి.. ఎటువంటి తప్పు చేయలేదని ఎలా బుకాయించగలుగుతున్నారు? కొంచెమైనా ఆత్మసాక్షి ఉందా? మీరే ఆలోచించుకోండి. ప్రజలే ఆలోచించుకుంటారు’’ అని గౌతమ్ ఎమోషనల్ అయ్యారీ వీడియోలో.
This post was last modified on May 7, 2024 3:33 pm
2009లో అవతార్ సినిమా రిలీజైనపుడు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోయిందో తెలిసిందే. అప్పటిదాకా ఉన్న అన్ని బాక్సాఫీస్…
ఉప్పెన సినిమా చేసే సమయానికి కృతి శెట్టి వయసు కేవలం 17 ఏళ్లే. అంత చిన్న వయసులోనే ఆమె భారీ…
ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్‌ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్‌ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అమెరికా సహా పొరుగున ఉన్న…