ఈ వారం కొత్త రిలీజులకే జనం వస్తారో రారోననే అనుమానాలు నెలకొంటే మే 10 ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్ చేయబోతున్నారు. నాటు నాటు పాటకు గాను ఆస్కార్ పురస్కారం అందుకున్నాక ఒకసారి తక్కువ స్క్రీన్లలో మళ్ళీ విడుదల చేశారు కానీ ఆశించిన స్పందన రాలేదు.
అప్పటికే ఆన్ లైన్, శాటిలైట్ ఛానల్స్ లో లెక్కలేనన్నిసార్లు చూసేయడంతో ప్రేక్షకులకు మళ్ళీ థియేటర్లకొచ్చేంత ఆసక్తి లేకపోయింది. ఇప్పుడు పరిస్థితిలో పెద్దగా మార్పేమి లేదు. ఆర్ఆర్ఆర్ వచ్చి కేవలం రెండు సంవత్సరాలే దాటింది. ఇంత అత్యవసరంగా మళ్ళీ జనం ముందుకు తీసుకురావాల్సిన అవసరం లేదు.
పొలిటికల్ హీట్ ఎక్కువగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబే ఎలాంటి మేజిక్ చేయలేకపోయింది. ఉదయం వేసిన ఒకటి రెండు షోలు మినహాయించి పెద్దగా ఆడలేదని వసూళ్లు స్పష్టం చేశాయి. అలాంటప్పుడు ఆర్ఆర్ఆర్ తో పని జరగడం అనుమానమే.
అయినా రీ రిలీజ్ అంటే కనీసం పది సంవత్సరాల గ్యాప్ ఉంటేనే దాని తాలూకు అనుభూతులను మళ్ళీ పొందడానికి ఆడియన్స్ ఆసక్తి చూపిస్తారు. అంతే తప్ప ఇంకా మైండ్ లో ఫ్రెష్ గా ఉన్న ఎక్స్ పీరియన్స్ కోసం మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టమంటే అంత సులభంగా జరిగే పని కాదు. అయినా ఆర్ఆర్ఆర్ ధైర్యమేంటో మరి.
దీని సంగతమేమో కానీ రాజమౌళి మహేష్ బాబు కాంబో మూవీ ఎప్పుడు మొదలవుతుందనే దాని మీద మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఈ నెలాఖరున ప్రకటన వచ్చే అవకాశం లేకపోలేదు.
ఆర్ఆర్ఆర్ తో అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ పెంచుకున్న రాజమౌళి ఈసారి మహేష్ ని తోడుగా తీసుకోవడంతో అంచనాలు ఆకాశం దాటడమే కాదు బిజినెస్ పరంగానూ ఎవరూ టచ్ చేయలేని సరికొత్త ల్యాండ్ మార్క్స్ చూడబోతున్నాం. ట్రిపులార్ ప్రభంజనం చూసిన జపాన్, యుకె లాంటి విదేశీ బయ్యర్లు ఎంత రేట్ అయినా సరే ఎస్ఎస్ఎంబి 29 కోసం ఎగబడుతున్నారట. ఆర్ఆర్ఆర్ దెబ్బ అలాంటిది మరి.
This post was last modified on May 7, 2024 12:35 pm
2009లో అవతార్ సినిమా రిలీజైనపుడు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోయిందో తెలిసిందే. అప్పటిదాకా ఉన్న అన్ని బాక్సాఫీస్…
ఉప్పెన సినిమా చేసే సమయానికి కృతి శెట్టి వయసు కేవలం 17 ఏళ్లే. అంత చిన్న వయసులోనే ఆమె భారీ…
ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…