ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌కు, అటు ప్రతిపక్ష టీడీపీ-జనసేనలకు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓడితే ఇరు వర్గాల భవితవ్యం ప్రమాదంలో పడుతుంది. అందుకే ఎన్నికల కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.
గత ఎన్నికల్లో ఏకంగా 151 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చిన జగన్.. ఈసారి తీవ్ర వ్యతిరేకత మధ్య ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. తనపై వచ్చిన వ్యతిరేకతకు తోడు.. ప్రతిపక్షాలు ఒక్కటై పోటీ పడుతుండటంతో జగన్ గెలుపు అంత తేలిక కాదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సర్వేల్లో కూడా జగన్‌కు వ్యతిరేకంగానే ఫలితాలు వస్తున్నాయి. దీనికి తోడు ఎన్నికల ముంగిట వరుసగా జగన్ అనుకూల అధికారులు బదిలీ అవుతుండడం వైసీపీని కలవర పరిచేదే. ఎన్నికల ముంగిట ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తాలూకు నెగెటివ్ ఎఫెక్ట్ కూడా బలంగానే పని చేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే జగన్‌లో ఓటమి భయం పెరిగిపోయిందనే చర్చ జరుగుతోంది. తాజాగా ఎన్నికల ప్రచారంలో జగన్ బేల మాటలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం రోజు రోజుకూ తగ్గిపోతోందని జగన్ వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రభుత్వ పథకాలకు సంబంధించి తాను బటన్లు నొక్కి డబ్బులు విడుదల చేసినా.. అవి జనాలకు చేరకుండా అడ్డుకుంటున్నారని, అలాగే అధికారులను ఇష్టానుసారం మార్చేస్తున్నారని.. దీంతో ఎన్నికలు సక్రమంగా జరుగుతాయా అన్న అనుమానం కలుగుతోందని జగన్ ఒకింత నిరాశతో కూడిన స్వరంతో మాట్లాడారు.
ఐతే జగన్‌లో ఓటమి భయం పెరిగిపోవడం వల్లే ఇలా బేలగా మాట్లాడుతున్నారని.. ఇలాంటి మాటలు ఓటమికి సంకేతాలని.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట కేసీఆర్ సైతం ఇలాంటి నెగెటివ్ ధోరణిలోనే మాట్లాడారని అంటున్నారు. జగన్ ఆఖరి రాగం పాడేశాడంటూ ప్రతిపక్ష పార్టీల వాళ్లు సోషల్ మీడియాలో ఈ వీడియోను వైరల్ చేస్తుండటం గమనార్హం.
This post was last modified on May 7, 2024 6:45 am
భారత్ నుంచి పరారైపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి సంబంధించి రోజుకో కొత్త తరహా వింతలు, విశేషాలు వెలుగు…
తాజాగా మరో రాజ్యసభ సీటుకు సంబంధించి ఎన్నికలకు రంగం రెడీ అయింది. వైసీపీ నాయకుడు, కీలక నేతల వేణుంబాకం విజయ…
ఇటీవలే విడుదలైన రవితేజ మాస్ జాతర పాటలో స్వర్గీయ చక్రి గొంతు విని సంగీత ప్రియులు ఆశ్చర్యపోయారు. అభిమానులు భావోద్వేగానికి…
తెలంగాణ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును…
ఏపీ సీఎం చంద్రబాబు విషయం గురించి చెబుతూ… మంత్రి నారాయణ ఒక మాట చెప్పారు. "మనం వచ్చే రెండు మూడేళ్ల…