జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నామినేషన్ ఆమోదం పొందడం.. గుర్తును కూ డా కేటాయించిన విషయం విదితమే. రిజిస్టర్డ్ పార్టీ కాకపోవడంతో.. ఆయన గుర్తు కోసం కొంత సస్పెన్స్ లో పడ్డారు. చివరకు గాజు గ్లాసు గు్ర్తు దక్కింది. ఇక, నామినేషన్ల పరిశీలన కూడా పూర్తయింది.
మొత్తం 35 మంది అభ్యర్థులు పిఠాపురం నుంచి బరిలో ఉన్నారు. వీరిలో ఇద్దరు కీలక పార్టీలకు చెందిన వారు. ఒకరు వైసీపీ నుంచి వంగా గీత, రెండు జనసేనాని పవన్. మిగిలిన 33 మంది స్వతంత్ర అభ్యర్థు లు. ఇక, తాజాగా నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో అభ్యర్థులను ఖరారు చేస్తూ.. ఎన్నికల అధికారులు జాబితా ఇచ్చారు. దీనిలో డమ్మీ ఈవీఎంపై నాలుగో నెంబరు బ్యాలెట్‌ను పవన్‌కు ఖరారు చేశారు.
అంటే.. ఈవీఎంపై నాలుగో నెంబరు బటన్ వద్ద.. జనసేన గుర్తు గాజు గ్లాసు ఉంటుంది. దీనికి పైన.. కింద ఎవరికి కేటాయిస్తారనేది చూడాలి. ఇదే విషయాన్ని జనసేన తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది. పవన్ కల్యా ణ్ కు నాలుగో నెంబరు ఖరారు చేశారని.. పార్టీ అభిమానులు.. కార్యకర్తలు, ప్రజలు పవన్‌ను గెలిపించేం దుకు 4వ నెంబరు బటన్‌ను ప్రెస్ చేయాలని పార్టీ అభ్యర్థించింది.
అయితే.. తొలి స్థానంలో `ఏ` అక్షరంతో మొదలయ్యే అభ్యర్థికి కేటాయించే అవకాశం ఉంది. అలా చూసుకుంటే.. రెండు మూడు స్థానాల్లోనే వైసీపీ అభ్యర్థి గీత కు చాన్స్ ఉంటుందని జనసేన నాయకులు అంచనా వేస్తున్నారు. దీనికితోడు స్వతంత్రులకు తొలి మూడు స్థానాలు (ఈవీఎంలలో) కేటాయించినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on April 30, 2024 7:29 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…