Political News

పవన్ ను ఓడించకపోతే పేరు మార్చుకుంటా

ఏదైనా మాట్లాడితే.. లాజిక్ ఉండాలి. ముఖ్యంగా పాత‌త‌రానికి చెందిన నాయ‌కులు.. ఒక కులాన్ని ప్ర‌భావితం చేస్తార‌ని భావించే నాయ‌కులు ముఖ్యంగా జాగ్ర‌త్త‌లు పాటించాలి. ఈ విష‌యంలో ఏ మాత్రం తేడా వ‌చ్చిన‌.. ఇబ్బంది త‌ప్ప‌దు. తాజాగా ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం.. సంచ‌లన వ్యాఖ్యలు చేశారు. ప‌వ‌న్‌ను ఓడించ‌క‌పోతే.. పేరు మార్చుకుంటాన‌ని అనేశారు. ఇదేస‌మ‌యంలో ఆయ‌న ఒక లాజిక్‌లేని వ్యాఖ్య కూడా చేశారు. ప‌వ‌న్‌ను ఏ అర్హ‌త ఉంద‌ని పిఠాపురంలో పోటీ చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు.

ఎక్క‌డో హైద‌రాబాద్‌లో ఉండే… ప‌వ‌న్ వ‌చ్చేస్తే.. ఇక్క‌డ గెలిపించాలా? ఇక్క‌డ ఆయ‌న‌కు ఓట్లేయాలా? అని ముద్రగ‌డ త‌న అక్క‌సు వెళ్ల గ‌క్కారు. కానీ, ఈ దేశంలో ఎక్క‌డి వారు ఎక్క‌డైనా పోటీ చేయొచ్చ‌న్న విష‌యం ఆయ‌న‌కు తెలియ‌దంటే ఎవ‌రూ న‌మ్మ‌రు. ఎక్క‌డో ఢిల్లీలో ఉన్న ఇందిర‌మ్మ‌.. 1978 ఎన్నిక‌ల్లో మెద‌క్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసిన విష‌యం ఆయ‌న మ‌రిచిపోయి అయినా.. అయి ఉండాలి.. లేక‌పోతే.. న‌టిస్తున్నార‌ని అనుకోవాలి.

పోనీ.. ఆ సంగ‌తి వ‌దిలేస్తే.. ఎక్క‌డో గుజ‌రాత్‌కు చెందిన ప్ర‌ధాని మోడీ.. యూపీలో వార‌ణాసి నుంచి వ‌రుస‌గా పోటీ చేస్తూనే ఉన్నారు. రెండు సార్లు విజ‌యం కూడా అందుకున్నారు. పోనీ.. ఈయ‌న విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. కాంగ్రెస్‌కు చెందిన అగ్ర‌నాయ‌కుడు రాహుల్‌గాంధీ వార‌స‌త్వంగా వచ్చిన అమేధీ నియోజ‌క‌వ‌ర్గాన్ని వ‌దిలేసి.. ఎక్క‌డో కేర‌ళ‌లో ఉన్న వ‌యనాడ్ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎంచుకున్నారు. ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకున్నారు. మ‌రి వీరంతా స్థానికులా?  అనేది ముద్ర‌గ‌డ చెప్పాలి.

ఇక‌, వైసీపీకే వ‌చ్చినా.. ఎక్క‌డో హైద‌రాబాద్‌లో ఉంటున్న సింహాద్రి చంద్ర‌శేఖ‌ర్‌ను వ‌ద్ద‌ని అంటున్నా.. తీసుకువ‌చ్చి.. మ‌చిలీప‌ట్నం ఎంపీ టికెట్ ఇచ్చారు. దీనికి ముద్ర‌గ‌డ ఏం చెబుతారు?  అంతేకాదు.. అస‌లు మ‌న రాష్ట్రంతోనే సంబంధం లేని.. క‌ర్ణాట‌క‌కు చెందిన గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి బందువు.. జోల‌ద‌రాశి శాంత‌ను తీసుకువ‌చ్చి.. హిందూపురం ఎంపీగా వైసీపీ టికెట్ ఇవ్వ‌లేదా?  దీనికి ముద్ర‌గ‌డ స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా?  వారికి ఎందుకు ఓటేయాల‌ని టీడీపీ అంటే.. స‌మాధానం ఇవ్వ‌గ‌ల‌రా?  

సో.. దేశ చ‌రిత్ర‌లో నాయ‌కులు ఎక్క‌డ నుంచి ఎక్క‌డైనా పోటీ చేయొచ్చ‌ని రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 84 స్ప‌ష్టంగా చెబుతోంది. ఇలాంట‌ప్పుడు.. వ్య‌క్తిగ‌త క‌క్ష‌లు పెట్టుకుని.. ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం ద్వారా.. ఉన్న ప‌రువును మ‌రింత దిగ‌జార్చుకోవ‌డ‌మే అవుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on April 30, 2024 5:05 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

7 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

10 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

10 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

10 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

10 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

11 hours ago