కరీంనగర్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని భావించిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కు ఆ టికెట్ దక్కకపోయినా ఊరట మాత్రం లభించింది. కరీంనగర్ టికెట్‌ను ఇవ్వని కాంగ్రెస్.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాత్రం పోటీ చేసే అవకాశాన్ని తీన్మార్ మల్లన్నకు కల్పించింది. నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న బరిలో దిగనున్నారు.
కరీంనగర్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ సీటు కోసం ప్రవీణ్‌రెడ్డి, వెలిచాల రాజేందర్‌రావు, తీన్మార్ మల్లన్న తదితరులు పోటీపడ్డారు. తీన్మార్ మల్లన్న ఈ సీటు కోసం తీవ్రంగానే ప్రయత్నించారు. కానీ ఆయన్ని ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పరిగణించలేకపోయింది. చివరకు ఈ టికెట్ వెలిచాల రాజేందర్‌రావుకు దక్కింది. దీంతో నిరాశలో మునిగిపోయిన తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ గుడ్‌న్యూస్ చెప్పింది. నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను బరిలో దింపుతున్నట్లు ప్రకటించింది.
నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం మొత్తం 4.61 లక్షల మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. నిజానికి 2021లో ఈ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో మల్లన్న ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కోదండరాంను దాటేసి మల్లన్న రెండో స్థానంలో నిలవడంతో ఒక్కసారిగా ఆయన హాట్ టాపిక్‌గా మారారు. మరి ఈ సారి కాంగ్రెస్ నుంచి బరిలో దిగుతున్న మల్లన్న విజయం ఖాయమనే అభిప్రాయాలున్నాయి. ఈ ఉప ఎన్నికలో గెలిస్తే మరో మూడేళ్ల పాటు ఆయన ఎమ్మెల్సీ పదవిలో ఉండే అవకాశముంది.
This post was last modified on April 26, 2024 6:37 am
నిన్న మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచక్కా చేతులు కలిపారు. సంక్రాంతి పుణ్యమా అని.. రాష్ట్రంలోని ఉభయగోదావరి…
దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు…
ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…
రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్‌ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…