కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం లోక్ సభ అభ్యర్థి టికెట్ ఖరారు వ్యవహారం కలకలం రేపుతున్నది. తన భార్య నందినికి ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి భట్టి, మాజీ మంత్రి మండవకు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్, తన కుమారుడికి ఇవ్వాలని మంత్రి తుమ్మలలు, తన భార్య కాకుంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాయల నాగేశ్వరరావుకు ఇవ్వాలని భట్టి కోరారు. కాగా ఈ సీటు తన సోదరుడు ప్రసాదరెడ్డికి ఇవ్వాలని, లేదంటే వియ్యంకుడు రఘురాంరెడ్డికి ఇవ్వాలని మంత్రి పొంగులేటి పట్టుబట్టారు. ఈ సీటు ఖరారు చేసే వ్యవహారం నిన్న బెంగుళూరులో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వద్దకు కూడా వెళ్లింది. భట్టి, పొంగులేటి ఈ విషయంలో ఖర్గే వద్ద చర్చలు జరిపారు.
అయితే అధిష్టానం నుండి ఎలాంటి ప్రకటన రాకముందే ఈ రోజు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి రఘురాం రెడ్డి నామినేషన్ పత్రాలను అందజేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ రఘురాం రెడ్డి ఆ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది.
ముఖ్యమంత్రి రేవంత్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలకు ఈ వ్యవహారంతో పొంగులేటి చెక్ పెట్టినట్లేనని, వారిద్దరు సూచించిన అభ్యర్థులను కాదని పొంగులేటి తన వియ్యంకుడితో ఎంపీగా నామినేషన్ దాఖలు చేయించడం అంటే వారికి చెక్ పెట్టినట్లేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. పొంగులేటి కుటుంబసభ్యులకు టికెట్ రాకుండా అడ్డుకోవడానికి సీఎం రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎంతగానో ప్రయత్నించినట్టు పార్టీ అంతర్గత వర్గాల సమాచారం. అయినప్పటికీ వాళ్లందరి అభిప్రాయాన్ని కాదని అధిష్ఠానం పొంగులేటి వియ్యంకుడు నామినేషన్ దాఖలు చేయడం కలకలం రేపుతున్నది.
గత శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి తనతో పాటు ఖమ్మం, నల్లగొండ జిల్లాలతో పాటు మరి కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్థుల గెలుపు కోసం ఆర్థికంగా ఆదుకున్నట్లు సమాచారం. దాదాపు 20 మంది వరకు ఎన్నికల ఖర్చు ఆయన భరించినట్లు కాంగ్రెస్ వర్గాల వాదన. ప్రస్తుతం ఖమ్మం లోక్ సభ సీటు తన వారికి ఖరారు చేసుకున్న నేపథ్యంలో ఇతరుల సహకారం ఎంత వరకు ఉంటుందో అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అధిష్టానాన్ని ఒప్పించినా స్థానిక మంత్రులను ఎంత వరకు ఒప్పించ గలుగుతారు అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
This post was last modified on April 24, 2024 5:49 am
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…