దళిత యువకులకు శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ, ప్రస్తుతం మండపేట నియోజకవర్గం అభ్య ర్థి తోట త్రిమూర్తులుకు హైకోర్టు షాకిచ్చింది. సుమారు 28 ఏళ్ల కిందటి ఈ కేసులో ఇటీవల తుది తీర్పు వచ్చింది. విశాఖ పట్నంలోని అట్రాసిటీ కేసుల విచారణ కోర్టు.. దీనిలో దోషులుగా తేలిన 9 మందికి 18 నెలల జైలు, రూ.2 లక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే.
వీరిలో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా ఉన్నారు. అయితే.. ఈ కేసులో తుదితీర్పు వెలువడిన తర్వాత.. త్రిమూర్తులు సహా.. దోషులు అందరూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు ను నిలుపుదల చేయాలని కోరారు. దీనిని విచారణకు స్వీకరించిన రాష్ట్ర హైకోర్టు.. ఇప్పటికిప్పుడు దీనిపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే.. లోతైన విచారణ జరపాలన్న అభ్యర్థనను మాత్రం పరిశీలిస్తామని పేర్కొంది.
ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించి ప్రతివాదులుగా ఉన్న వారికి నోటీసులు జారీ చేసింది. మే 1వ తారీకు వరకు కేసు విచారణను వాయిదా వేసింది. అయితే.. కీలకమైన ఎన్నికల వేళ.. ఈ పరిణామం.. తోట త్రిమూర్తులుకే కాకుండా.. వైసీపీకి కూడా ఇబ్బందిగా మారింది. తోట త్రిమూర్తులు నామినేషన్ కనుక తిరస్కరణకు గురైతే.. మండపేట నుంచి ఎవరిని బరిలో నిలపాలనేది ప్రశ్నగా ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్యులు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on April 24, 2024 5:39 am
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…