సార్వత్రిక ఎన్నికల కారణంగా దేశమంతటా రాజకీయ వేడి రాజుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలూ ఉండటంతో ఆ హీట్ మరింత ఎక్కువైంది. ఇక్కడ కుర్చీ కాపాడుకోవడం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేసేందుకూ వెనుకాడటం లేదు. మరోవైపు ఏపీ భవిష్యత్ కోసం కూటమిగా ఏర్పడిన టీడీపీ, జనసేన, బీజేపీ గెలుపు ధీమాతో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు అధికారంలోకి రావాలో నిర్ణయించడంలో యువత ఓట్లు కీలకంగా మారే అవకాశముంది. ముఖ్యంగా కొత్తగా ఓటు పొందిన వాళ్లు ఎటు వైపు మొగ్గు చూపుతారన్నది కీలకంగా మారింది.
జనవరిలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన తుది జాబితా ప్రకారం ఏపీలో 4 కోట్ల 8 లక్షల ఓటర్లున్నారు. ఓటర్ల జాబితాను ప్రత్యేకంగా సవరించిన తర్వాత కొత్తగా 22 లక్షల మంది ఓటర్ల జాబితాలో చేరారు. వీళ్లలో 18, 19 ఏళ్ల ఓటర్లు ఏకంగా 8 లక్షల మంది ఉన్నారు. కొత్తగా ఓటు హక్కు పొందిన ఈ యువకులు తొలిసారి ఓటు వేయాలనే ఉత్సాహంతో కనిపిస్తున్నారు. మరి ఈ తొలి ఓటు ఎటు పడుతుందన్నదే ఆసక్తికరంగా మారింది.
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కే తమ తొలి ఓటు వేస్తామని అక్కడి యువత చెబుతోందని తెలిసింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా జనసేన పోటీ చేసే స్థానాల్లో యువత ఆ పార్టీకే జై కొట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక మిగతా చోట్ల మాత్రం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు మద్దతునిచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏపీ అభివృద్ధి కూటమితోనే సాధ్యమవుతుందని యువత నమ్ముతున్నారని టాక్. ఇది కూటమికి కలిసొచ్చే అవకాశముంది. యువత కూటమికి అండగా నిలిస్తే అప్పుడు జగన్‌కు షాక్ తప్పదు. చూడాలి మరి ఏం జరుగుతుందో?
This post was last modified on April 23, 2024 6:21 pm
పైన హెడ్డింగ్ చదవగానే అరే మిస్సయ్యామే అనే ఫీలింగ్ ఎవరికైనా కలుగుతుంది. అలాంటిదే అభిమానులు ఎదురు చూస్తున్న విక్టరీ వెంకటేష్,…
ఉమ్మడి కృష్నా జిల్లాలోని గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం అంటే.. కొడాలి నానితోపాటు.. వైసీపీ పేరు కూడా వినిపిస్తుంది. నానితో పాటు..…
ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం పరిధిలోని అమ్మనబ్రోలుకు చెందిన టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి దారుణ హత్యపై సీఎం…
ప్రభాస్ అభిమానుల సహనానికి పరీక్ష పెడుతూ వచ్చినది రాజా సాబ్ ఎట్టకేలకు ప్రమోషన్ల పరంగా ఒక అడుగు ముందుకు వేస్తోంది.…
విజయవాడ ప్రస్తుత ఎంపీ.. కేశినేని చిన్ని(శివనాథ్), మాజీ ఎంపీ కేశినేని నాని(శ్రీనివాస్) ఇద్దరూ తోడబుట్టిన అన్నదమ్ములు. రాజకీయంగా వైరం లేకపోయినా..…
‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో గాడిన పడ్డట్లే పడి.. ఆ తర్వాత ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాలతో ఎదురు దెబ్బలు తిన్నాడు…