వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. నోరు ఉంది కదా.. అని ఇష్టం వచ్చిన ట్టు మాట్లాడద్దంటూ.. గట్టి హెచ్చరిక చేశారు. తాను మాట్లాడడం మొదలు పెడితే.. చాలా ఇబ్బంది పడతావ్! అంటూ వ్యాఖ్యానిం చారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని మచీలీపట్నంలో టీడీపీ-జనసేన సంయుక్తంగా నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ.. ఆసాంతం నిప్పులు చెరిగారు. తాను భీమవరం నుంచి పిఠాపురానికి నియోజకవర్గం మార్చుకుంటే.. సీఎం జగన్‌కు ఎందుకని ప్రశ్నించారు. ఆయన 70 మంది ఎమ్మెల్యేలను ఎందుకు మార్చాడో సమాధానం చెప్పాలన్నారు.
తన కుటుంబంపైనా..తన వ్యక్తిగత విషయాలపైనా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడని.. తాను కూడా మాట్లాడాల్సి ఉంటుందని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. “క్లాస్ వార్-మాస్‌వార్ అంటున్నాడు(జగన్).. ప్రజలను దోచుకోవడమే క్లాస్ వార్. ఇది మేం చేయలేదు. నువ్వే చేశావు. ఐదేళ్లు అన్ని విధాలా ప్రజలను దోచేసి.. ఇప్పుడు కబుర్లు చెబుతున్నాడు” అని పవన్ వ్యాఖ్యానించారు. అధికారం చేపడుతూనే ప్రజావేదిక కూల్చేయలేదా? అని ప్రశ్నించారు.
పోలీసులకు వీక్లీఆఫ్‌ల ఎర చూపి.. వారిని తనకు అనుకూలంగా మార్చుకుని చివరకు మోసం చేశాడని అన్నారు. మత్స్యకారులను మోసం చేసేందుకు జీవో 217 తీసుకువచ్చాడని.. పవన్ వ్యాఖ్యానించారు. ఇసుకను దోచుకుని.. భవన నిర్మాణ కార్మికులను అడ్డంగా ముంచేశాడన్నారు. వారు దాచుకున్న డబ్బులు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు.
ఆయన నోరు డ్రైనేజీ!
పవన్ తన ప్రసంగంలో మంత్రి, పెడన ఎమ్మెల్యే(ప్రస్తుతం పెనమలూరు నుంచి పోటీ చేస్తున్నారు) జోగి రమేష్‌పై పేరు ఎత్తకుండానే.. విరుచుకుపడ్డారు. “ఇక్కడి ఎమ్మెల్యే దోపిడీ దారుడని అందరూ చెబుతున్నారు. ఆయన నోరు విప్పితే.. బూతులు.. ఇంటి ముందు డ్రైనేజీ బాగు చేయడం చేతకాదు.. ఈయనకు మంత్రి పదవి. ఆ యన నోరే పెద్ద డ్రైనేజీ. అందినకాడికి అందరి నుంచి దోచేశాడు. రైతులు, చిన్న చిన్నవ్యాపారుల నుంచి దండుకున్నాడు. వీళ్లు మాకునీతులు చెబుతున్నారు” అని పవన్ వ్యాఖ్యానించారు. ఇక్కడ అభివృద్ధిని ప్రశ్నించిన జనసేన కార్యకర్తలు, నాయకులపై గంజాయి కేసులు పెట్టించారని అన్నారు. అయినా.. తమ సైనికులు వెరవకుండా ముందుకు సాగారని పవన్ వ్యాఖ్యానించారు.
This post was last modified on April 18, 2024 11:33 am
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…