జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ స్థానంలో ఆయన గెలుపు తథ్యమని ఇటీవల టీడీపీలోకి చేరిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు సంలచన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. అందరూ చెబుతున్నట్టుగా లక్ష ఓట్ల మెజారిటీ రాకపోయినా.. ఖచ్చితంగా 65 వేల ఓట్ల మెజారిటీతో పవన్ గెలుస్తున్నారని చెప్పారు. తాను చేయించిన సర్వేల్లో పవన్‌కు అనుకూలంగా మెజారిటీ ప్రజలు తీర్పు చెబుతున్నట్టు తెలిసిందన్నారు. పవన్ కోరుకునేవారే ఎక్కువగా ఉన్నారన్నారు. ఇక్కడ మెగా కుటుంబానికి భారీ ఫాలోయింగ్ ఉందని చెప్పారు. ఇది పవన్‌కు ప్లస్ అవుతుందన్నారు.
తాజాగా పిఠాపురంలో పర్యటించిన రఘురామకృష్ణరాజు.. పవన్ కొత్తగా అద్దెకు తీసుకున్న ఇంటిని సందర్శించారు. పవన్‌తోనూ భేటీ అయ్యారు. ఆయనకు పట్టు శాలువా కప్పి.. సత్కరించారు. పవన్ ఆరోగ్యం బాగోలేదన్న వార్తలు తనను కలచి వేశాయని.. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకునేందుకు తాను స్వయంగా పిఠాపురం వచ్చానని చెప్పారు. ప్రస్తుతం స్వల్ప జ్వరంతో పవన్ ఇబ్బంది పడుతున్నట్టురఘురామ తెలిపారు. తాను పిఠాపురంలో గత వారం రోజులుగా తన మనుషులతో సర్వే చేయించినట్టు తెలిపారు. ఈ సర్వేలో 65 వేల ఓట్లపైగా మెజారిటీతో పవన్ గెలుస్తున్నారని తనకు సమాచారం ఉందన్నారు. తాను చెప్పింది తూ.చ. తప్పకుండా జరుగుతుందని చెప్పారు. రాసిపెట్టుకోవాలని మీడియాకు సూచించారు.
ఇక, పవన్‌ను ఓడించేందుకు.. అనేక మంది రెడ్లు ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నారన్న విషయాన్ని ప్రస్తావించిన రఘురామ.. ఎంత మంది రెడ్లు వచ్చినా.. పవన్‌ను ఓడించడం సాధ్యం కాదన్నారు. సాక్షత్తూ సీఎం జగన్‌రెడ్డి వచ్చి ఇక్కడ కూర్చున్నా.. పవన్ ఓటమి అనే మాట వినిపించదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అరాచక పాలన పోవాలని కాపులు కోరుకుంటున్నారని.. కాపులే కాదు.. అన్ని వర్గాల ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని.. ఇది పిఠాపురం నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. పిఠాపురంలో పవన్‌కు తిరుగులేదని రఘురామ వ్యాఖ్యానించారు.
ఇక, తనకు చంద్రబాబు ఎక్కడ నుంచి పోటీ చేయాలని ఆదేశించినా శిరసా వహిస్తానని రఘురామ తెలిపారు. అసెంబ్లీ అయినా.. చట్టసబే కదా.. అని ప్రశ్నించారు. కుదిరితే పార్లమెంటుకు…లేకపోతే అసెంబ్లీకి అయినా తన పోటీ ఖాయమని చెప్పారు. తను ఎక్కడ నుంచి పోటీ చేసినా.. పవన్ కళ్యాణ్ తన తరఫున ఎన్నికల ప్రచారం చేస్తారని రఘురామ తెలిపారు. వైసీపీ నేతలు, రెడ్లు పన్నే పన్నాగాలకు ప్రజలే బుద్ధి చెబుతారని రఘురామ అన్నారు.
This post was last modified on April 9, 2024 9:56 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని మహానాడు…
తెలంగాణలో మరోసారి రాజకీయాలు హీటెక్కాయి. తాజాగా రేవంత్‌రెడ్డి సర్కారుపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన…
యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో షాక్ తగిలింది. వైసీపీ…
అండర్ 19 వరల్డ్ కప్ క్రికెట్ లో భారత బాలికల జట్టు సత్తా చాటుతోంది. కౌలాలంపూర్ వేదికగా సాగుతున్న ఈ…
భారత్ మరోసారి టీ20 క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-1 తేడాతో…
రానున్న రోజుల్లో కాల్ చేయకుండా డైరెక్ట్‌గా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడం, ధరల గురించి తెలుసుకోవడం, ఇతర వివరాలు సేకరించడం మరింత…