ఏపీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల వేళ టాలీవుడ్ ఎటు వైపు ఉంటుందనేది ఆసక్తిగా మారింది. దీనిపై ఇప్పటికీ ఎవరూ మాట్లాడడం లేదు. అందరూ గుంభనంగానే ఉంటున్నారు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా.. యువ హీరో నిఖిల్ టీడీపీ బాట పట్టారు. టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తాజాగా టీడీపీలో చేరారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో నిఖిల్ టీడీపీ కండువా కప్పుకొన్నారు. నిఖిల్ కు పసుపు కండువా కప్పిన నారా లోకేష్ పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు.
“నిజంగా ఇది ఎవరూ ఊహించని పరిణామం. నిఖిల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. సామాజిక స్పృహతో కొన్ని పోస్టులు పెట్టినప్పటికీ, రాజకీయాలపై అతడికి ఆసక్తి ఉన్న విషయం పెద్దగా ఎప్పుడూ బయటికి రాలేదు. ఇప్పుడు ఎన్నికల సమయంలో నిఖిల్ టీడీపీలోకి రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది” అని నారా లోకేష్ అన్నారు. ఇదిలావుంటే, నిఖిల్ ఏదైనా టికెట్ ఆశించారా? అనే చర్చ కూడా జరుగుతోంది. అయితే.. టీడీపీ తుది జాబితా కూడా వచ్చేసింది. కూటమిలో భాగంగా పంచుకున్న 144 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. దీంతో నిఖిల్ కు పార్టీలో ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారన్నది చూడాలి.
టాలీవుడ్‌లో మెల్లగా మొదలై..
టాలీవుడ్ లో మెల్లగా మొదలైన నిఖిల్ ప్రస్థానం.. ప్రస్తుతం మంచి సక్సెస్ లో దూసుకుపోతోంది. యువ హీరోల్లో నిఖిల్ సక్సెస్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. గత ఏడాది వచ్చిన కార్తికేయ-2, 18 పేజెస్, స్పై చిత్రాలు సూపర్‌గా సక్సెస్ అయ్యాయి. సంబరం చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ హ్యాపీ డేస్ చిత్రంతో తొలి హిట్ కొట్టాడు. ఆ తర్వాత స్వామి రా రా, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి చిత్రాలతో పుంజుకున్నాడు.
This post was last modified on March 29, 2024 10:51 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…