ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం హిందూపురం అసెంబ్లీ స్థానం. ఇక్కడ నుంచి వరుసగా ఇప్పటి వరకు నందమూరి బాలకృష్ణ విజయం దక్కించుకున్నారు. గతంలో ఎన్టీఆర్ కూడా ఇక్కడ నుంచి గెలిచారు. ఇక, 2014, 2019లో బాలయ్య గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. ఈ సారి ఆయనపై స్వాములోరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి రెడీ అయ్యారు. ఈ క్రమంలో ఆయన తాజాగా ప్రకటన కూడా చేశారు. వాస్తవానికి మూడో సారి కూడా ఇక్కడ నుంచి గెలుపుగుర్రం ఎక్కేందుకు బాలయ్య ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు వైసీపీ కూడా ఇక్కడ బాలయ్యను ఓడించేందుకు శత విధాలా ప్రయత్నిస్తోంది. మరోవైపు.. ఇప్పుడు ఇక్కడ బాలకృష్ణను ఓడిస్తానంటూ కాకినాడ శ్రీపీఠం అధిపతి.. స్వామి పరిపూర్ణానంద సిద్ధమయ్యారు. వాస్తవానికి తెలంగాణ నుంచి వచ్చేసిన ఆయన ఏపీలోనే ఉంటున్నారు. గత మూడేళ్లుగా హిందూపూర్ పార్లమెంట్ నుంచి పోటీకి రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని బీజేపీకి కూడా చెప్పారు. బీజేపీ టికెట్ కోసం పరిపూర్ణానంద స్వామి ప్రయత్నించారు. కానీ, టీడీపీ ఆ స్థానాన్ని పొత్తులో భాగంగా టీడీపీనే దక్కించుకుంది.
దీంతో తనకు అన్యాయం చేసింది బీజేపీ కాదని, టీడీపీనేనని అంటున్నారు స్వామి. టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్వామి హిందూపూర్ అసెంబ్లీ లేదా పార్లమెంటు స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. బాలకృష్ణ కోసం రెబల్‌గా పోటీ చేసి టీడీపీని బ్లాక్ మెయిల్ చేసి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఎన్నికల్లో తన తడాఖా చూపిస్తానంటూ బాలకృష్ణ, టీడీపీకి వ్యతిరేకంగా టీవీ ఇంటర్వ్యూలు ఇచ్చారు. 2019లో హిందూపూర్ అసెంబ్లీలో బీజేపీ అభ్యర్థికి 1.18% ఓట్లు వచ్చాయి. ఇది కాంగ్రెస్ ఓట్ల కంటే తక్కువ.
ఇక హిందూపూర్ పార్లమెంట్‌కు కాంగ్రెస్ అభ్యర్థి కంటే బీజేపీ అభ్యర్థికి 1.03% ఓట్లు తక్కువ వచ్చాయి. బీజేపీ గుర్తు కూడా లేని ఈ స్వామి… రెండు సార్లు గెలిచిన బాలయ్యను ఓడించేందుకు సిద్ధమని ప్రకటించడం గమనార్హం. అది కూడా హిందూపురంలో. ఈ వారం చివర్లో హిందూపూర్‌లో తన ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్టు ఆయన చెప్పడం గమనార్హం. దీంతో హిందూపురం క్యామెడీ అయిపోయిందనే టాక్ వినిపిస్తోంది.
This post was last modified on March 29, 2024 10:42 pm
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దేవర 2 ఉంటుందా లేదా అనే దాని గురించి డిస్కషన్లు ఎక్కువయ్యాయి. డిజిటల్…