కాలం కలిసి రావడమంటే ఇలానే ఉంటుంది. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. ఇప్పుడు ఆ యువ నేతకు పట్టం కట్టేందుకు నియోజకవర్గం ప్రజలు రెడీగా ఉన్నారు. అదే అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం. ఇక్కడ నుంచి టీడీపీ నేతృత్వంలోని కూటమి పార్టీల అభ్యర్థిగా గంటి మోహన చంద్ర బాలయోగి (జీఎంసీ బాలయోగి) కుమారుడు హరీష్ మాధుర్ పోటీ చేస్తున్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేశారు. అయితే..అ ప్పట్లో వైసీపీ హవా, మహిళా నాయకురాలు చింత అనురాధ సెంటిమెంటుతో గంటి వారసుడు గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు.
అయితే.. ఇప్పుడు రెండు రకాలుగా మాధుర్‌కు కాలం కలిసి వచ్చిందని అంటున్నారు పరిశీలకులు. ఇక్కడ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పోటీ చేస్తున్నారు. అయితే.. ఆయన ముందుగానే అస్త్ర శస్త్రాలు వదిలేశారనేటాక్ ఉంది. దీనికి అనేక కారణాలు. ఒకటి ఎలాగైనా అతన్ని కసి తీరా ఓడించాలని జనసైనికులు పట్టుదలగా ఉన్నారు. అలాగే రాపాక తనకు, తనస్థాయికి మించిన సీటుగా ఎంపీసీటును భావిస్తున్నారు. దీంతో ప్రచారంలో ఇంకా స్పీడు అందుకోలేక పోతున్నారు. అంతేకాదు.. నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీలో ఇక్కడ ఊపు కనిపించడం లేదు.
ఇంకోవైపు.. టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి అభ్యర్ధి, టీడీపీ నేత గంటి హరీష్‌మాధూర్ ప్రచారంలో దూకుడు గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మండపేట, ముమ్మిడివరం, కొత్తపేట, పి.గన్నవరం నియోజకవర్గాలతో పాటు అమలాపురంలో తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. అంతేకాదు.. జనసేనలో యువతను కలుపుకొని పోతున్నారు. ఇక, సొంత పార్టీ టీడీపీలో అందరూ గంటి వారసుడికే జై కొడుతున్నారు. దీనికి తోడు తండ్రి మరణం తర్వాత.. గంటి కుటుంబం నుంచి రాజకీయంగా ప్రాధాన్యం లభించలేదు.
ఈ నేపథ్యంలో ఈ సారైనా గంటి కుటుంబాన్ని గెలిపించుకుని తీరాలన్న కసి.. ఇక్కడి ప్రజల్లో స్ఫస్టంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఓటమికి సంబందించి సానుభూతి, జీఎంసీ బాలయోగి కుమారుడు కావడం ఆయనకు కలిసొస్తున్నారు. ఇంకో వైపు జనసేన యూత్ ఓట్లు.. యువ నాయకుడు అనే టాక్ కూడా గంటికి అనుకూలంగా మారాయి. మొత్తంగా చూస్తే.. అమలాపురం స్థానంలో ఈ దఫా టీడీపీ గెలుపు గుర్రం ఎక్కినట్టేనని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on March 29, 2024 3:24 pm
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…