రాజనీతి- ఇటీవల కాలంలో ప్రధాని మోడీని ఆకాశానికి ఎత్తేస్తూ.. బీజేపీ నేతలు చెబుతున్న మాట. రాజనీ తిని మోడీ బహుబాగా ప్రదర్శిస్తున్నారని వారు డప్పు కొడుతున్నారు. మరి వారు ఏ కాంటెస్టులో చెబుతు న్నారో తెలియదు కానీ.. క్షేత్రస్థాయిలో అయితే.. మాత్రం `రాజనీతి ఇదేనా మోడీ సర్` అనే ప్రశ్నలే ఎదురవుతున్నాయి. దీనికి కారణం.. కాంగ్రెస్‌కు బలమైన రాష్ట్రాల్లో ఆ పార్టీని నిర్వీర్యం చేసేందుకు మోడీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
ఆ పార్టీ నుంచి బలమైన నేతలను నయానో.. భయానో.. తన పార్టీలోకి చేర్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తోం ది. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో ఉన్న జిందాల్‌ను ఇటీవల బీజేపీలోకి తీసుకున్నారు. వాస్తవానికి ఆయన బీజేపీకి కడు వ్యతిరేకి. కానీ, తెరచాటున ఆయన వ్యాపారాలను భయపెట్టారో.. లేక ఆయననే భయ పెట్టా రో తెలియదు కానీ.. జిందాల్‌ను అక్కున చేర్చుకున్నారు. ఇక్కడ వ్యక్తులు టార్గెట్‌గా కంటే కూడా.. బీజేపీ కాంగ్రెస్ పాలిత లేదా కాంగ్రెస్‌కు బలమైన రాష్ట్రాలను టార్గెట్ చేసుకుని ముందుకు సాగుతోంది.
కీలకమైన ఎన్నికల సమయంలో 543 పార్లమెంటు స్థానాలకు గాను ఎన్డీయే కూటమి తరఫున 400 స్థానాలు దక్కించుకుని తీరాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ప్రజలను నమ్ముకోవడం అటుంచితే.. ఈ లక్ష్య సాధనకు పార్టీలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతుండడం గమనార్హం. మధ్య ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు బలం ఉంది. అయితే.. ఇప్పుడు ఇక్కడే `ఆపరేషన్ లోటస్` చేపట్టారు. బీజేపీ అధికారికంగా చెప్పిన వివరాల మేరకు.. ఒక్క మధ్య ప్రదేశ్ నుంచే 16111 మంది కాంగ్రెస్ నాయకులను పార్టీలో చేర్చుకున్నారట.
వీరిలో ఒక కేంద్ర మాజీ మంత్రి సహా ఏడుగురు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారనిబీజేపీ చెప్పింది. ఇక, పంజాబ్ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా ఈ నెల 21 నుంచి వారంరోజుల్లోనే బీజేపీ 600 మంది కాంగ్రెస్ నేతలను లాగేసుకుంది. ఇది అధికారికంగా బీజేపీ నేతలే చెప్పిన మాట. దీంతో ఒకప్పటి కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు బీజేపీ నేతలు గా మారిపోయారు. నిజానికి పంజాబ్‌పై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. కనీసం 10 స్థానాల్లో అయినా.. విజయం దక్కించుకోవాలనిలెక్కలు వేసుకుంది. అయితే.. బీజేపీ `ఆపరేషన్ లోటస్`తో ఇక్కడ కాంగ్రెస్ పునాదులు కదిలిపోయాయి. మరి ఇన్ని చేస్తున్న మోడీ.. రాజనీతి ఎలా అవుతుంది? అనేది మేధావుల ప్రశ్న. ఇలాంటి వాటికి మాత్రం బీజేపీ మౌనం పాటిస్తోంది.
This post was last modified on March 29, 2024 2:11 pm
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…