Political News

జ‌గ‌న్ వాయిస్‌..ఓట‌ర్ల‌ను ఎలా ఆక‌ర్షిస్తున్నారంటే!

ఏపీ సీఎం జ‌గ‌న్ ఓట‌ర్ల‌ను ఆకట్టుకునేందుకు ఇప్ప‌టికే వివిధ రూపాల‌ను ఎంచుకున్నారు. సోష‌ల్ మీడియాలో వైసీపీ పాట‌లు, ప్ర‌సంగాలు, శ‌ప‌థాలు, జ‌గ‌న్ కామెంట్లు.. ఇలా ఒక‌టేమిటి.. వివిధ రూపాల్లో ప్ర‌చారాన్ని తీవ్ర‌స్తాయిలో చేస్తున్నారు. వీటికితోడు జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై సానుకూలంగా పేద‌ల కామెంట్ల‌తో కూడిన స‌మాచారాన్ని కూడా డిజిట‌ల్ రూపంలో దంచి కొడుతున్నారు. అయితే.. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చాక మ‌రో రూపంలో ప్ర‌చారాన్ని సీఎం జ‌గ‌న్ షురూ చేశారు.

తాజాగా సీఎం జగనే నేరుగా ఈ డిజిట‌ల్ ప్ర‌చారంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు బీద అరుపులతో మెసేజ్ ఫార్వ‌ర్డ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ప్రజలందరికీ జగన్ వాయిస్ తో మెసేజ్‌లు పంపుతున్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి చాలా మంది ప్రజల మొబైల్ ఫోన్లకు ఈ వాయిస్ మెసేజ్‌లు వస్తున్నాయి. అవి విని ప్రజలు షాక్ అవుతున్నారు. ఇదో కొత్త ప్ర‌చారం మొదలు పెట్టారా? అంటూ చ‌ర్చించుకోవ‌డం గ‌మ‌నార్హం.

ఇదీ.. జ‌గ‌న్ వాయిస్‌..

“నాకు చంద్రబాబు లాగా 10 మంది సినిమా నటులు స్టార్ కాంపెయినర్స్ లేరు. మీడియా అండ లేనే లేదు. ఆకాశంలో నక్షత్రాల్లా మీరే స్టార్ కాంపెయినర్స్. నేను మీ బిడ్డను, అన్నను త‌మ్ముణ్ని. తోడుగా రావాలని ప్రజలకు పిలుపునిస్తున్నా” అని జ‌గ‌న్ త‌న వాయిస్‌తో అన్ని ఫోన్ల‌కు మెసేజ్‌ల‌కు పంపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

టీడీపీ ఫైర్‌

సీఎం జ‌గ‌న్ వాయిస్‌తో కూడిన‌ మెసేజ్‌లు వైరల్ అవడంతో.. విపక్ష నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. సీఎం జగన్ పంపిన ఈ సందేశాలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తాయని, దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాల్సిందేనని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయంపై ఎన్నికలకు కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నేతలు రెడీ అయ్యారు.

This post was last modified on March 22, 2024 10:42 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మెగా సపోర్ట్ ఏమైనట్లు?

టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…

5 hours ago

వివేకా కేసులో స్పీడు పెంచిన సునీత

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…

11 hours ago

గౌతంరెడ్డికి ఈ సారి మూడిన‌ట్టేనా?

పూనూరు గౌతం రెడ్డి. విజ‌యవాడ‌కు చెందిన వైసీపీ నాయ‌కుడు. అయితే.. గ‌తంలో ఆయ‌న వంగ‌వీటి మోహ‌న్‌రంగాపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో…

14 hours ago

‘కంగువ’ శబ్ద కాలుష్యం.. టెక్నీషియన్ ఆవేదన

సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…

15 hours ago

కూట‌మి నేత‌లు కూడా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాలి: చంద్ర‌బాబు వార్నింగ్‌

అసెంబ్లీ వేదిక‌గా కూట‌మి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏల‌కు, పార్టీల కార్య‌కర్త‌ల‌కు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…

15 hours ago