తెలంగాణలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకపక్షంగా దూసుకుపోతుందా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ఎఫెక్ట్ జోరుగా పనిచేయనుందా? అంటే.. సర్వే ఔననే అంటోంది. తాజాగా వెల్లడైన ఏపీబీ- సీ ఓటరు సర్వే.. సంచలన విషయాలను వెల్లడించింది. మొత్తం 17 పార్లమెంటు స్థానాల్లో గుండుగుత్తగా 10 స్థానాలను కాంగ్రెస్ బుట్టలో వేసుకుంటుందని సర్వే తేల్చి చెప్పడం గమనార్హం.
తెలంగాణలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మరోసారి అదే ఊపు కొనసాగించే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. తెలంగాణలో ఉన్న 17 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 10 స్థానాలు గెలుచుకుంటుందని తాజాగా నిర్వహించిన ఏబీపీ – సీ ఓటర్ ఒపీనియన్ పోల్స్ లో వెల్లడైంది. బీజేపీకి కేవలం 4 స్థానాలు, బీఆర్ఎస్ పార్టీకి 2, ఎంఐఎం ఒక్క స్థానంలో గెలిచే అవకాశాలు ఉన్నాయని తేలింది.
సీట్ల షేరింగ్ ఇదీ..
కాంగ్రెస్: 10, బీజేపీ: 4, కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ 2, ఎంఐఎం 1 స్థానం దక్కించుకోనున్నారు. దీనిలో కాంగ్రెస్ పార్టీ గత రెండు ఎన్నికల్లోనూ లేని విధంగా దూసుకుపోతుందని సర్వే చెప్పడం గమనార్హం. దీనికి కారణం సీఎం రేవంత్ రెడ్డి డైనమిక్ నిర్ణయాలే కారణమని పేర్కొనడం మరో కీలక విషయం.
ఇక ఓటింగ్ విషయంలోనూ కాంగ్రెస్ జోరుగా ముందుకు సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ 42.9 శాతం ఓట్లు సాధించనుంది. బీజేపీ కన్నా బీఆర్ఎస్ కు ఎక్కువ ఓటింగ్ ఉంటుందని సర్వే పేర్కొంది. 28.4 శాతం మంది ఓటర్లు బీఆర్ఎస్ కు మొగ్గు చూపుతుండగా, బీజేపీకి 25.11 శాతం ఓట్లు వస్తాయని తేలింది. అయినా బీజేపీకి నాలుగు పార్లమెంట్ స్థానాలు దక్కే అవకాశం ఉంది.
ఓట్ల షేరింగ్ ఇలా..
కాంగ్రెస్ 42.9%, బీజేపీ 25.1%, బీఆర్ఎస్ 28.4% ఓట్ల షేరింగ్ ఉంటుందని సర్వే తెలిపింది.
This post was last modified on March 15, 2024 10:46 am
హరిహర వీరమల్లు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యంత ఆలస్యం అవుతున్న సినిమా. ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసి…
ప్రవస్థి అనే యువ సింగర్.. ఈటీవీలో వచ్చే లెజెండరీ మ్యూజిక్ ప్రోగ్రాం పాడుతా తీయగాలో తనకు జరిగిన అన్యాయంపై తీవ్ర…
పసిడి పరుగులు పెడుతోంది. క్షిపణి వేగాన్ని మించిన ధరలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని మార్కెట్…
ఏపీలో వైసీపీ పాలనలో చీపు లిక్కరును మద్యం బాబులకు అంటగట్టి.. భారీ ధరలతో వారిని దోచేసిన విషయం తెలిసిందే. అన్నీ…
ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పలువురు మంత్రులను కలుసుకుని సాగునీటి ప్రాజెక్టులు, రైలు…
నవ్యాంధ్ర రాజధానిలో పెట్టుబడులు.. పరిశ్రమలు.. మాత్రమేకాదు.. కలకాలం గుర్తుండిపోయేలా.. ప్రముఖ పర్యాటక ప్రాంతంగా కూడా దీనిని తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు…