Political News

పార్టీ అభ్యర్ధులను కేసీయారే మోసంచేశారా ?

బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో నేతలతో జరిగిన సమీక్షలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యంగా ఉంది. నేతలతో కేసీఆర్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా బీఆర్ఎస్-బీజేపీ మధ్యే ఉంటుందన్నారు. అలాగే బీఆర్ఎస్ తరఫున పోటీచేసి ఓడిపోయిన ఎంఎల్ఏలు, ఎంఎల్ఏ అభ్యర్ధులపై జనాల్లో ఇంకా వ్యతిరేకత పోలేదని కేసీఆర్ చెప్పారు. పనిలోపనిగా కీలకమైన వ్యాఖ్య ఏమిటంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందని తనకు తెలుసన్నారు. పార్టీ ఓటమి ఖాయమని 15 రోజుల ముందే తనకు సమాచారం ఉందని చెప్పటమే విచిత్రంగా ఉంది.

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి ఖాయమని ముందే తెలిసినపుడు అభ్యర్ధులతో అంతంత ఖర్చులు ఎందుకు పెట్టించారనే ప్రశ్న ఇపుడు నేతల మధ్య చర్చకు దారితీసింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకు అభ్యర్ధులు కోట్లాది రూపాయలు ఖర్చులు చేసుకున్నారు. డబ్బుకు డబ్బూ పోయింది, వ్యక్తిగతంగా ఓడక తప్పలేదు. ఇదే సమయంలో పార్టీ కూడా ఓడిపోయింది. దాంతో పెట్టిన ఖర్చంతా బూడిదలోపోసిన పన్నీరుగా అయిపోయిందని అభ్యర్ధులు లబోదిబో మంటున్నారు. అయితే అడ్డదిడ్డంగా సంపాదించిందే కదా మొన్నటి ఎన్నికల్లో కొందరు ఖర్చుచేసిందనే సెటైర్లు కూడా పార్టీలోనే వినబడుతున్నాయి.

జనాలంతా ఎంఎల్ఏలు మాత్రం ఓడిపోయి కేసీఆర్ మాత్రమే గెలవాలని కోరుకున్నారట. అయితే ఆ కోరిక మొదటికే మోసం తెచ్చిందని ఇపుడు కేసీయార్ అనటమే ఆశ్చర్యంగా ఉంది. ఎంఎల్ఏలందరు ఓడిపోతే ఇక కేసీయార్ అధికారంలోకి ఎలా వస్తారు ? ఇంతచిన్న లాజిక్ జనాలకు తెలీకుండానే ఉంటుందా ? ఇక్కడ విషయం ఏమిటంటే కేసీయార్ పరిపాలన అవసరం లేదని అనుకున్నారు కాబట్టే బీఆర్ఎస్ ను జనాలు ఓడగొట్టారంతే. ఎంఎల్ఏలు మాత్రం ఓడిపోవాలి, కేసీయార్ మాత్రమే గెలవాలని జనాలు నిజంగానే అనుకుంటే మరి కామారెడ్డిలో స్వయంగా కేసీయారే ఎందుకు ఓడిపోయారు ?

ఇక్కడ విషయం ఏమిటంటే జనాలు మార్పును కోరుకున్నారు కాంగ్రెస్ ను గెలిపించారంతే. ఈ విషయాన్ని అంగీకరించటానికి కేసీయార్ సిద్ధంగాలేరు. లేకపోతే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ బీఆర్ఎస్-బీజేపీ మధ్యే ఉంటుందని అనటంలో అర్ధమేంటి ? అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును తక్కువగా చూడటమే కదా. కాంగ్రెస్ పుంజుకుందన్న విషయాన్ని కేసీయార్ అంగీకరించలేకపోతున్నారు. అందుకనే ఇప్పటికీ కాంగ్రెస్ ను చాలా చులకనగా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ లో ఓడిన ఎంఎల్ఏల మీద జనాల్లో వ్యతిరేకత తగ్గలేదంటే ఇక పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధులు ఎలా గెలుస్తారు ?

This post was last modified on March 4, 2024 2:59 pm

Share

Recent Posts

249 కొట్టినా గెలవలేని టీం ఇండియా

టీ20 మ్యాచ్‌లో 249 పరుగులు చేస్తే గెలుపు దాదాపు ఖాయమని అనుకుంటాం. కానీ వెస్టిండీస్ బ్యాటర్లు ఆ అంచనాలను తలకిందులు…

2 hours ago

బ్లాక్ బస్టర్ మనకెందుకు నచ్చడం లేదంటే

కన్నడలో గత నెల 25 ప్యారడైజ్ తో పాటుగా విడుదలైన ప్రేమద ఊరల్లీ భీభత్సమైన కలెక్షన్లతో కర్ణాటకలో అదరగొడుతోంది. రెండో…

3 hours ago

అష్ట‌దిగ్భంధ‌నంలో దేశ రాజధాని

వైద్య విద్య ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించిన నీట్ ప‌రీక్ష పేప‌ర్ లీక్‌కు సంబంధించి కాక్రోచ్ జ‌న‌తా పార్టీ చేసిన నిర‌స‌న…

4 hours ago

తెలంగాణ హీరో రాయలసీమ యాస పేలిందా

ఒక ప్రాంతానికి సంబంధించిన పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సినిమాలు తీసేటప్పుడు యాస విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డైలాగులు రాయడం…

5 hours ago

కొత్త ప్రభుత్వాలు బలంగానే ఉన్నాయి

తాజాగా మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో అధికారంలో ఉన్న పార్టీలే హ‌వా చూపించాయి.…

5 hours ago

బీసీ రిజర్వేషన్ల విషయంలో తగ్గేదెలే అంటున్న చంద్రబాబు

బీసీలంటే వెనక బడిన కులాలు కాదు బ్యాక్ బోన్ కులాలంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నానికి సుప్రీం కోర్టు తీర్పుతో ఆటంకం…

6 hours ago